పుట:1857 ముస్లింలు.pdf/129

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

ఈ మేరకు తండ్రు-కొడుకులు కలసి ప్రథమ శ్వాఆతంత్య్రసంగ్రామంలో కలాన్ని ఆయుధంగా వలసపాలకుల మీద అక్షరాగ్నులు కురిపించారు. ప్రజలను చెతన్యవంతుల్ని చేస్తూ పోరాట యోధాులకు బాసటగా నిలిచారు. ఆ దిశగా మౌలానా బాఖర్‌ 'రిసాల-యే-జిహాద్‌' (Risala-i-Jihad) అను శీర్షికతో ఓ కరపత్రం ప్రచురించారు. ఆ కరపత్రంలో బ్రిటిషు వారిని ఈ దేశం నుండి తరిమి కొట్టాల్సిన అవసరాన్ని వివరిస్తూ పరాయి పాలకులను నిర్దాకణ్యంగా స్వదేశం నుండి పాలద్రోలాల్సింది గానూ, ఆ లక్ష్యంతో సాగుతున్న పోరాటాలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిందిగానూ పిలుపునిచ్చారు. ఈ మహత్తర లక్ష్యాన్ని సాధించాలంటే దేశంలోని హిందువులు-ముస్లింలు ఐక్యంగా ఉమ్మడి శత్రువు మీద తిరుగులేని యుద్ధ్దం సాగించాలని మౌలానా బాఖర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.( Who's Who of Indian Martyrs 1857, Dr. P.N.Chopra, Vol.III, 1973, P. 95)

ఈ సందర్భంగా మౌల్వీ బాఖర్‌ రాఖిం ఆసిం అను పేరుతో ఆంగ్లేయుల చర్య లను ప్రశ్నిస్తూ పోరాటయోధుల చర్య లను సమర్ధిస్తూ ఓ సుదీర్ఘ… లేఖను ప్రకటించారు. పటిష్టమైన సమాచార సేకరణ వ్యవస్థతో ఎప్పటికప్పుడు నూతన సమాచారాన్ని రాబట్టుకుంటూ, ఆయా పరిణామాలను తనదైన దాృక్పథంతో విశ్లేషించారు. భారతావని అంతా సాగుతున్న పోరాటాల సమాచారాన్ని సేకరించి ప్రజలను ఉత్తేజితులను చేసే రీతిలో ప్రచురిస్తూ, ఈ లేఖలో తిరుగుబాటుకు తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ లేఖ ఆంగ్లేయుల కోపకారణమైంది.

1857 సెపెంబరు 18న తిరుగుబాటు విఫలమై డిల్లీ నగరం తిరిగి ఆంగ్లేయల స్వాధీనంలోకి వచ్చాక ఆంగ్లేయాధికారులకు కొరకరాని కొయ్యగా తయారైన మౌలానా ముహమ్మద్‌ బాఖర్‌ కోసం వేట ఆరంభమైంది. 1857 డిశంబరు 14న ఆంగ్లేయ సెనికులు ఆయనను నిర్బంధించారు. ప్రథామ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న వారిలో అత్యధికులను నిరాయుధులను చేసి నిర్దాక్షిణ్యంగా కాల్చివేసిన దుష్ట చరిత్ర గల మేజర్‌ హడ్సన్‌ సమక్షానికి ఆయనను తీసుకొచ్చారు. మౌలానా బాఖర్‌ మీద మొదటినుండుి మండిపడుతున్న ఆ ఆంగ్లేయాధికారి మౌలానాను చిత్రహింసలకు గురిచేసి చివరకు స్వయంగా కాల్చి చంపాడు. అనంతరం ఆంగ్ల సైనికులు మౌలానా గృహం మీద పడి

126