పుట:1857 ముస్లింలు.pdf/128

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కలం యోధులు


గొప్ప సైన్య సంపత్తి జ్ఞప్తికి తెస్తున్నాం...ప్రజలకు వీరంతా మార్గదర్శకులే. ఇదేవిధంగా మన స్వాతంత్య్ర సంగ్రామం కూడాచరిత్రలో లిఖించబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మన వీరోచిత గ్రంధాలు చరిత్రలో శాశ్వతంగా నిలచిపోతాయి. మీ వీరత్వం ముందు ఫిరంగులు ఏపాటివి? స్వాతంత్య్ర సముపార్జన కోసం విజృంభించండి అని ఆయన పేర్కొన్నారు. (గీటురాయి, 18-7-2003, పేజీ.19)

మౌలానా బాఖర్‌ తన పత్రిక ఢిల్లీ ఉర్దూ అఖ్బార్‌ ను 1857 లై 19 తేది నుండి అఖ్బారుల్‌ జఫర్‌ (Akhbar-ul-Zafar) గా మార్చారు. ఆ సంచికలో ఆయన స్వయంగా రాసిన సంపాదకీయంలో, ప్రజలను నా దేశ ప్రజలారా అని సంబోధిస్తూ , ఆంగ్లేయుల ఎత్తుగడలు, వక్రమైన తెలివితేటలు, అంతులేని ఖనాజాలను చూసి ఆంగ్లేయులను జయించటం అసాధ్య మని అధర్య పడుతున్నారా? అని ప్రశ్నిస్తూ హిందూ- ముస్లిలను తమ ధార్మిక గ్రంథాలలో నిర్ధేశించబడి విషయాలను మననం చేసుకుంటూ, ఆ గ్రంథాల వెలుగులో ఆదిపురుషుడు తప్ప ఏదీ శాశ్వతం కాదని తెలుసుకుని ధైర్యంగా ముందుకు సాగమని ఈ క్రింది విధంగా ఉద్భోదించారు.

O my countrymen, looking at the strategy and devious cleverness of the English...and their overflowing treasuries you may feel disheartened and doubt that such a people could ever be overcome. But those who are my Muslim Brothers by faith, let them consider - if they are anxious and concerned out of worldly considerations- to look at their religious book, such as the Quran, the Tafsie and Hadis, and those who belong to the Hindu Dharm, let them by the light of their gyan (wisdom) and dharma (faith), illumine the hearts and first see that except the Adipururush, the Primeval Deity, nothing is permanent. (Frontline, June 29, 2007, P.18)

మౌలానా బాఖర్‌ కుమారుడు మౌలానా ముహమ్మద్‌ హుసైన్‌ ఆజాద్‌ కూడ తండ్రి బాటలో నడిచారు. ఆయన కూడ తిరుగుబాటును ప్రేరేపిస్తూ, పోరాట యోధుల శౌర్యప్రతాపాలను కీర్తిస్తూ ఢిల్లీ ఉర్దూ అఖ్బాలో రచనలు చేశారు. మౌలానా బాఖర్‌ మార్గంలోనే ఆంగ్లేయుల దుష్ట చర్య లకు ఏమాత్రం భయపడకుండా మాతృభూమి విముక్తి ప్రదానంగా భావిస్తూ తన రచనా వ్యాసంగాన్ని సాగించారు. ప్రదమ స్వాతంత్య్రసంగ్రామ సమయంలో ఆ పోరాటాన్ని ప్రస్తావిస్తూ తారిఖే ఇంక్విలాబ్‌ ఇబరత్‌ అఫ్‌జా శీర్షికతో మౌలానా ఆజాద్‌ రాసిన కవిత చాలా ప్రసిద్ధిగాంచింది.

125