పుట:1857 ముస్లింలు.pdf/127

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

ఆంగ్లేయ సైన్యాలతో తలపడుతున్న ప్రజలను, స్వదేశీ యోధుల త్యాగాలను, శౌర్యప్రతాపాలను ఢిల్లీ ఉర్దూ అఖ్బార్‌ సంపాదకులు ముహ్మద్‌ బాఖర్‌ తన వ్యాసాలలో, వార్తలలో శ్లాఘిస్తూ వ్యాఖ్యానించారు. ఆనాడు ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామ యోధులకు, నేతలకు, తిరుగుబాటును ప్రోత్సహించే కవులు-రచయితలకు ఢిల్లీ ఉర్దూ అఖ్బా అక్షర వేదికయ్యింది. ఈ పత్రిక ద్వారా బహదాూర్‌ షా జఫర్‌ ప్రజలకు సందేశాలు, సమాచారం కూడా పంపించారు.

ఈ పోరాటం విజయవంతం కావాలంటే ప్రజలు హిందూ-ముస్లిం ప్రజల ఐక్యత అత్యవసరమని భావించిన మౌల్వీ ముహమ్మద్‌ బాఖర్‌ ఆ దిశగా కూడ పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు ప్రచురించారు. ఐక్యతను మరింతగా పటిష్ట పర్చేందుకు ఆయన ప్రత్యేక శ్రద్ధను తీసుకున్నారు. అందుకు గాను చరిత్ర, ఇతిహాసాలు, పురాణాలను ఆధారంగా చేసుకుని అందులోని సమాచారాన్ని ఉపయోగించుంటూ ఉత్తేజం కల్గించే రీతిలో పలు వ్యాసాలు రాశారు. ఆయన రాసిన వ్యాసాలలోని కొన్నివ్యాఖ్యానాలు ఈ విధాంగా ఉండేవి:

.. యూరపుకు చెందిన ఈ నీచ జాతికి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు చేద్దాం !...మోసపూరితంగా మనతో పనులు చేయించుకుంటున్న ఈ దుష్ట నీచులను అంతమొందిద్దాం. వీరి నికృష్ట పాలన అంతమయ్యేదాకా మనకు నిష్క్రమణ లేదు... మన పూర్వీకుల వీరోచిత లక్షణాలను ఆవాహన చేసుకుని..స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంగ్లేయులను అంతం చేద్దాం, (ఆంగ్లేయులను ముప్పుతిప్పలు పెట్టిన మౌలానా ముహమ్మద్‌ బాఖర్‌, షబ్నా, గీటురాయి వారపత్రిక, 18-7-2003, పేజీ. 18)

ఈ విధాంగా ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామం ఉధృతరూపం దాల్చేంగుకు ఢిల్లీ ఉర్దూ అఖ్బా ఎంతగానో దోహదాపడింది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల క్రూరచర్యలకు ఏమాత్రం అదరకుండ బెదరకుండా నేరుగా తిరుగుబాటు యోధులను ప్రోత్సహిస్తూ తిరుగుబాటుకు మౌల్వీ బాఖర్‌ స్వయంగా పిలుపునిచ్చారు.

1857 జూన్‌ నాటి ఢల్లీ ఉర్దూ అఖ్బార్‌లో తిరుగుబాటు యోధులను సంభోధిస్తూ వీర సిపాయీల్లారా ! ఇంతకు ముందు రాజరికాల్లో కనపర్చిన మీ సాహసకృత్యాలు ఇప్పటికీి భద్రంగా ఉన్నాయి. మహాభారత కాలంలోని భీముడు, అర్జునుడు మీతో ఉన్నారు. ముస్లింలలో అమీర్‌ తౌ(తై)మూరు, చంఫీుస్‌(జ్‌) ఖాన్‌, హలాఖు ఖాన్‌ల

124