పుట:1857 ముస్లింలు.pdf/123

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

పర్యటనలు చేశారు. ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్న సమయానికి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఆరంభం కాలేదుదాు. అయినా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలను, స్వదేశీ సైనిక యోధులను మౌల్వీ కూడగడ్తూ, ఆంగ్లేయుల పట్ల పచ్చి వ్యతిరేకతను ప్రజలలో రెచ్చగొడుతున్నారు. ఆయన పర్య టనలను, ఆయన చేస్తున్న ప్రసంగాల సారాంశాన్ని నిర్భయంగా వెల్లడిస్తూ, ప్రజలలో తిరుగుబాటు భావాలు ఏర్పడి, బలపడడానికి 'తిల్సిం-యే-లక్నో' ఎంతగానో తోడ్పడింది.

ఆ ప్రసంగాల మూలంగా ఆగ్రహించిన ఆంగ్లేయాధికారులు మౌల్వీ అహ్మదుల్లాను నిర్బంధించారు. ప్రజల అండదడలతో బ్రిటిష్‌ చెరనుండి విముక్తి పొందిన మౌల్వీ అహ్మదాుల్లా 1856 నవంబరులో ఉత్తర ప్రదేశ్‌లోని అవధ్‌ చేరుకున్నారు. అవథ్‌ నవాబు వాజిద్‌ అలీషా పట్ల ఆంగ్లేయులు వ్యవహరించిన తీరుతెన్నులను దుయ్యబడుతూ కంపెనీ పాలనకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు. ఆ సందర్భంగా మౌల్వీ విముక్తి ఉందంతాన్ని, ఆయన ప్రసంగాలను 'తిల్సిం-యే-లక్నో' వెల్లడించింది. మౌల్వీ ప్రసంగాల ధోరణిని ప్రస్తావిస్తూ, 1857 జనవరి 30 నాి తిల్సిం -యే-లక్నో సంచికలో '..Ahamedullah shah...is very fearless in saying whatever he wishes to say and to large crowd is always there,...although he is unable to do anything, orally he always pleads for jehad..' అని పేర్కొందాని S. Jaheer Hussain Jafri Social Scientist Vol. 26 Nos. 1- 4, Jan.- April1998, P. 42 The Profile of Saintly Rebel - Moulvi Ahamadullah Shah ' అను వ్యాసంలో ఉటంకించారు.

ఈ పత్రిక మౌల్వీ కార్యకలాపాలను ఉత్సాహపూరితంగా వార్తల రూపంలో ప్రచురిస్తూ ప్రజలలో నూతన ఉత్తేజాన్ని కల్గిస్తూ అక్షరాల పరంగా తిరుగుబాటుకు గట్టి పునాదులను ఏర్పర్చి లక్నోలో తిరుగుబాటు విజృంభణకు కారణమయ్యింది. ఈ తిరుగుబాటు అవథ్‌ బేగం హజరత్‌ మహాల్‌ నాయకత్వంలో విజయవంతమైపలు మాసాల పాటు స్వదేశీ పాలన సాగింది. ఈ తిరుగుబాటుకు, అ తరువాత స్వదేశీ ప్రభుత్వానికి ప్రజలు ఇతోధికంగా సహాయపడటంలో కూడ తిల్సిం-యే-లక్నో లాంటి పత్రికలు వ్యాప్తి చేసిన భావజాలం ఎంతోగానో తోడ్పడిందనడం సత్యదూరం కాబోదు.

ఈ తరహాలో లాహోర్‌ నుండి మున్షీ హర్‌సుఖ్‌ రాయ్‌ (Munshi Har Sukh Rai) స్థాపించిన 'కోహినూర్‌' (Kohi-i-Noor) ఉర్దూ పత్రిక కంపెనీ పాలకుల చర్యలను

120