Jump to content

పుట:1857 ముస్లింలు.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలం యోధులు


ప్రజలు ఎదుర్కొంటున్నఇక్కట్లనూ సోదాహరణంగా వివరించారు. అధికారుల అహంకారానికి గురైన బాధిత ప్రజల పక్షం వహించిన మౌలానా అక్షరాలను ఆయుధాలుగా మలచి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నఆంగ్లేయాధికారుల మీద పోరాటం సాగించారు.

పరాయి పాలకుల మీద అక్షరాలతో దండెత్తిన మౌలానా అంతటితో మిన్నకుండి పోలేదు. ఆంగ్లేయుల అండదండలను వత్తాసుగా తీసుకుని తమ కండబలంతో ప్రజల మీద హింస, దోపిడీలకు పాల్పడుతున్న దుర్మదాంధులకు వ్యతిరేకంగా ఎంతో ధైర్య సాహసాలతో విమర్శనాస్త్రాలను సంధించారు. ప్రజల పక్షం వహించిన ఆయన ప్రజలకు వ్యతిరేకమైన ప్రతి వ్యక్తినీ, ప్రతి వ్యవస్థనూ తన విమర్శనాత్మక వ్యాసాలతో దారిలోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

ఈ విధంగా కంపెనీ పాలకులకు, ఆ పాలకుల తొత్తులకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో మౌల్వీ బాఖర్‌ ఎనలేని కృషిచేశారు. ఆ కారణంగా మౌలానా బాఖర్‌ ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. అయినా ఆయన లెక్కచేయలేదు. ఢిల్లీ ఉర్దూ అఖ్బార్‌ తన పంథాను మార్చుకోలేదాు. ఈ మేరకు బహుళ ప్రచారం పొందిన ఢిల్లీ ఉర్దూ అఖ్బార్‌ 1857కు ముందు నుండే ఢిల్లీ నగరవాసులలో మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజల హృదయాలలో తిరుగుబాటు బీజాలు నాటి అవి ఏపుగా ఎదగడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించింది. (ఆంగ్లేయులను ముప్పుతిప్పలు పెట్టిన మౌలానా ముహ్మద్‌ బాఖర్‌, షబ్నా, గీటురాయి వారపత్రిక, హైదారాబాద్‌, 18-7-2003, పేజీ. 18)

ఢిల్లీ ఉర్దూ అఖ్బార్‌ బాటలో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం లక్నోనుండి ప్రచురితమైన 'తిల్సిం-యే-లక్నో' ఉర్దూ వారపత్రిక తొలుత నుండి బ్రిటిష్‌ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ పత్రికకు ఫిరంగి మహాల్‌కు చెందిన మౌల్వీ ముహమ్మద్‌ యాకూబ్‌ అన్సారి సంపాదకత్వం వహించారు. ఆయన స్వతంత్ర భావనలు గల స్వదేశాభిమాని. ఆంగ్లేయుల పెత్తనం సమసిపోవాలని కోరుకున్న మేధావి. ఆ కారణంగా బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వ్యక్తులకు ప్రాధాన్యతనిస్తూ 'తిల్సిం-యే-లక్నో' ద్వారా ఆయోధులను ప్రోత్సహించారు.

ప్రథమ స్వాతంత్రసంగ్రామంలో ప్రముఖ పాత్ర వహించిన మౌల్వీఅహ్మదుల్లా షా ఫైజాబాది ఆంగ్లేయులకు వ్యతిరేకంగా కత్తిపట్టాల్సిందిగా ప్రజలను కోరుతూ పలు

119