పుట:1857 ముస్లింలు.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

ఆనాడు పర్షియన్‌ భాష రాజభాష కాగా స్వదేశీ భాష అయినటువంటి ఉర్దూ ప్రజల భాషగా మన్నన పొందింది. ఆ కారణంగా తొలుత కొన్ని పత్రికలు పర్షియన్‌ భాషలో ప్రచురితమైనా, ప్రజల నుండి వ్యక్తమైన డిమాండ్‌ను బట్టి ఉర్దూ భాషలో వెలువడిన సంఘటనలు, తొలుత ఉర్దూలో ఆరంభించబడి ఆ తరువాత పర్షియన్‌ మరియు ఉర్దూ భాషలలో ప్రచురితమైన సంఘటనలు కూడ ఉన్నాయి. ఈ పత్రికల భాష ఏదైనా లక్ష్యం ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలన అంతం,స్వభావం ప్రజల పక్షంగా సాగాయి.

ఈ విధంగా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి మూడు దశలుగా పత్రికలు తోడ్పడ్డాయి. ప్రజలలో బ్రిటిష్‌ వ్యతిరేకతను ప్రోదిచేసి తిరుగుబాటు మనసత్వాన్నిపదిలం చేసేందుకు తొలిదశగా సహకరించాయి. సంగ్రామం ఆరంభమయ్యాక అప్రతిహతంగా ఆ పోరు ముందుకు సాగేందుకు ప్రజలను, స్వ్వదేశీ పాలకులను, స్వదేశీ సైనికయాధులను ఉత్తేజపర్చుతూ రెండవదశలో చేయూత నిచ్చాయి. ఢిల్లీ కేంద్రంగా విముక్తి పోరాటం సమసిపోయాక కూడ ఇతర ప్రాంతాలలో రగులుతున్నపోరాట స్పూర్తిని సజీవంగా ఉంచేందుకు మూడో దశలో తమదైన ప్రత్యేక పాత్రను నిర్వహించాయి.

ఈ క్రమంలో పరిశీలిస్తే 1836లో బహు భాషాకోవిదుడైన మౌలానా ముహ మ్మద్‌ బాఖర్‌ సంపాదకత్వంలో ఆరంభమై ఢిల్లీ ఉర్దూ అఖ్బార్‌ (Delhi Urdu Akhbar) ఉర్దూ వారపత్రికను తొలిదశ నుండి మలిదశ వరకు బ్రిటిష్‌ వ్యతిరేకతను ప్రజలలో రెచ్చగ్టొిన వైనం వెల్లడవుతుంది. ఈ పత్రిక ఢిల్లీ నగరంలో ప్రారంభమైన తొలి ఉర్దూ పత్రికగా చరిత్ర సృషించింది. తొలుత సాధారణ సాహిత్య-సమాచార పత్రికగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఢిల్లీ ఉర్దూ అఖ్బార్‌ 1857 నాటికి తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకుంది.

ఆంగ్లేయ వ్యతిరేకతను పుష్కలంగా పుణికిపుచ్చుకున్నమౌలానా బాఖర్‌ సంపాదకత్వంలో ఢల్లీ ఉర్దూ అఖ్బార్‌ ఆంగ్లేయాధికారుల తప్పిదాలను, ఆశ్రితపక్షపాతాన్ని ఉటంకిస్తూ, ఆ చర్యలను విమర్శిస్తూ, వార్తలు ప్రచురిస్తూ, వ్యాఖ్యానాలు రాసింది. స్వదేశీయులకు ఎక్కడ అన్యాయం జరిగినా, మరెక్కడైనా అధికారులు స్థానిక ప్రజలపట్ల అనుచితంగా వ్యవహరించినా మౌల్వీ బాఖర్‌ మిన్నకుండా తన విమర్శనాత్మక వ్యాసాలతో ఆ అధికారుల గుట్టును రట్టు చేశారు. శాంతి భద్రతల విషయంలో అధికారుల వెపల్యాలను,

118