పుట:1857 ముస్లింలు.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

ఆనాటి రివాజు.

ఆ తరు వాతి కాలంలో ఈ వార్తాహరుల యంత్రాంగాన్నే ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉపయోగించుకుంది. కంపెనీ కాలంలో వార్తాహరులు, వార్తాహరుల బృందాలు రెండు వర్గాలయ్యాయి. కంపెనీ ఇచ్చే జీతాల కోసం కొందరు కంపెనీ సేవలో గడిపారు. ఈ వర్గం అన్నిరకాల రుగ్మతలకు అలవాటు పడింది. స్వదేశాభిమానం గల వార్తాహరులు పాలకుల ప్రాపకం కోరకుండా స్వంత పత్రికలు నడిపారు. ఆ విధంగా స్వంత పత్రికలు నడిపినవారిలో అత్యధికులు, ఆ పత్రికలకు వ్యాసాలు రాసిన పండితులు, వార్తలను పంపిన పాత్రికేయులు పరాయి పాలకుల దౌష్ట్యాన్ని ఎండగడు తూ ప్రజలపక్షం వహించారు. ఆ తరువాత సంభవించిన పరిణామాలలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో ప్రజలను ఉత్తేజపరుస్తూ అక్షరమే ఆయుధంగా విదేశీయుల దుర్మార్గాల మీద కలం యోధులు విరుచుకుపడ్డారు.

ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అక్షరాలను ఆయుధాలుగా చేసుకొని రచనలు చేసినవారు, కరపత్రాలను ప్రచురించి పంపిణిచేసినవారు, తమ ప్రసంగాలతో ప్రజలను వ్రభావితులను చేసనవారు ఎందారో కలరు. అటువంటి రచయితలలో మౌలానా ఫజలుల్‌ హక్‌ ఖైరతాబాది, ఢిల్లీ కళాశాల ఆచార్యులు మౌలానా ఇమాం బక్ష్, సెహబాయ్‌, ముహమ్మద్‌ బాఖర్‌, మీర్జా రహీముద్దీన్‌ హయా, ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌ మారూఫ్‌, ఫైజ్‌ అహ్మద్‌ రుస్వా, మౌల్వీ ముహమ్మద్‌ జహీర్‌ అలీ తదితరు లను ప్రదానంగా పేర్కొనవచ్చును. ఈ అక్షరయోధులలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అక్షరకవాతు చేసినందుకు మౌలానా ఫజలుల్‌ హఖ్‌ను అండమాన్‌కు తరలించగా, మౌల్వీ ముహమ్మద్‌ బాఖర్‌ను ఆంగ్లేయాధికారి కెప్టన్‌ హడ్సన్‌ కాల్చి చంపాడు. ఢిల్లీ పతనం తరువాత బహు గ్రంథ రచయిత, బహదూర్‌ షా జఫర్‌కు సన్నిహితుడైన ఇమాం బక్ష్ ఆంగ్ల సైనికులచే దారుణంగా కాల్చివేయబడ్డారు. ఆ సమయంలో కవిగా బహుదూర్ షా జఫర్‌కు మిత్రుడైన మీర్జా అసదుల్లా గాలిబ్‌ ఆంగ్లేయుల దారుణాల బారిన పడకుండా తప్పించుకోగలిగారు. ఢిల్లీలో తిరుగుబాటు యోధుల పోరాటం ముగిశాక ఆంగ్ల సైన్యాలు సాగించిన దారుణాలను గాలిబ్‌ తన రచనలలో హృదయ విదారకంగా వివరించారు.

అటు కవులూ ఇటు రచయితలూ, సంపాదకులూ, పాత్రికేయులూ ప్రజలపక్షం

116