పుట:1857 ముస్లింలు.pdf/118

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857 ముస్లింలు.pdf

అధ్యాయం - 4

ఢిల్లీ ఉర్దూ అఖ్బార్‌

కలం యోధులు

ప్రజలను ప్రదమ స్వాతంత్య్రసంగ్రామం దిశగా కార్యోన్ముఖులను చేయ డంలో కలం యోధుల పాత్ర చాలా ఉంది. స్వదేశీ సంస్థానాల మీద పెత్తనం చలాయిస్తూ, మాతృభూమి సర్వసంపదను దోచుకుంటూ, స్వదేశీ వర్తక-వాణిజ్యాలకు గండికొడుత్తూ, స్వదేశీ సైనికుల పట్ల తీవ్ర వివక్ష చూపుతూ, ప్రజల మత మనోభావాలు, ఆచార వ్యవహారాలలో జోక్యం చేసుకుంటూ, కడు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ అన్నిరకాలుగా స్వదేశీయులను కడగండ్ల పాల్జేస్తున్న ఆంగ్లేయుల దుష్ట చర్యలను అనునిత్యం ప్రజల దృష్టికి తెస్తూ తిరుగుబాటు భావజాలం పరివ్యాపికి పత్రికలు 1857కు పూర్వమే పునాదులు వేశాయి.

పూర్వం మనదేశంలో గూఢచారి వ్యవస్థ ఉంది తప్ప పత్రికా రంగం లేదు. ఒక విధంగా చెప్పాలంటే మొగల్‌ చక్రవర్తుల కాలంలో రాజ్యంలోని విశేషాలను తెలుసు కోనడానికి ప్రత్యేకంగా వార్తాహరుల నియామకం జరిగింది. ప్రముఖ సంఘటనలను రౌతుల ద్వారా, బృందాల ద్వారా సంబంధితులు రాబట్టుకునేవారు. ఆ విధంగా లభించిన సమాచారం పాలక ప్రభువుల దృష్టికి తీసుకెళ్ళి తద్వారా తగు నిర్ణయాలు తీసుకోవటం

115