పుట:1857 ముస్లింలు.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మౌల్వీలు అవకాశంగానీ, ఆ సంతోషం గానీ దక్కనివ్వరాదని నిర్ణయించుకుంది. ఆ కారణంగా బ్రిటిష్‌ ప్రబుత్వ వ్యతిరేక చర్య లకు పూనుకున్నవిప్లవకారులకు ఉరిశిక్షలు విధించకుండా ద్వీపాంతరవాస శిక్షలను విధించి అండమాన్‌కు పంపివేయటం ఆరంభించారు.

ప్రసద్ధి చెందిన అంబాలా కుట్రకేసులో విప్లవకారులకు న్యాయమూర్తి విధించిన మరణశిక్షలనుద్వీపాంతరవాస శిక్షలుగా మార్పించి ఆ విధంగా ఎందుకు మార్పించిందీ అంబాలా డిప్యూటీ కమీషనర్‌ వివరించారు. ఆయన వివరణ ఈ విధంగా సాగింది మీరు మరణ శిక్షలను అమరత్వం పొందు మంచి అవకాశంగా భావించి సంతోషిస్తున్నారు. అందువలన మీకు అయిష్టమైన శిక్షను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీకు విధించిన మరణశిక్షను జీవిత కాలపు ద్వీపాంతరవాస శిక్షగా

సమరయోధాులను ఉరిశిక∆లకు బలిచేసేందాుకు అంగ్లేయులు ఉపయోగించిన ఆండమాన్‌లోని ప్రత్యేక కట్టడం

మార్చటం జరిగింది. (You rejoice over the sentence of death and look upon it as martyrdom. The Government, therefore, have decided not to award you the punishment you like so much. The death-sentence passed against you has been changed to that of transportation or life. - Muslims In India, S.Abul Hasan Ali Nadwi, op.cit., P.113)

1857కు ముందు, 1857 సంగ్రామంలో, 1857 తరువాత కూడా తమలో ప్రజ్వరిల్లుతున్న బ్రిటిష్‌ వ్యతిరేకతను ఏమాత్రం చల్లారనివ్వకుండా సతతం పోరుబాట నడిచి ఆంగ్లేయాధికారులకు కంటి నిండా నిద్రను కరువు చేసిన మౌల్వీల పాత్ర గురించి

113