పుట:1857 ముస్లింలు.pdf/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

భౌతికకాయాన్ని తగులబెట్టించి, తమ రాక్షస ప్రవృత్తినీ, అబ్దుల్లా పట్ల ఉన్న భయాన్ని, ఆగ్రహాన్ని క్షుద్రంగా ప్రకటించుకున్నారు.

( " He was sentenced to death and in fury of revenge his body was cremated by the British instead of being buried " - Encyclopaedia of Muslim Biography Vol. I, Ed. Nagendra Kr. Singh, A.P.H Publishing Corporation, New Delhi, 2001, P. 141)

ఈ శిక్షలకు ఏమాత్రం భయపడని యోధులు తమకు విధించిన శిక్షలను గౌరవప్రదంగా, సంతోషంగా స్వీకరించడాన్ని ఆంగ్లేయాధికారులు, న్యాయమూర్తులు సహించలేకపోయారు.బ్రిటిష్‌ న్యాయస్థానం విధించిన ఉరిశిక్షలకు, ఆ తరువాతి పరిణామాలకు ఏమాత్రం భయపడకుండా, నా మాతృభూమి విముక్తి కోసం ఏనాడయితే నేను పోరాట దీక్ష చేపట్టానో, ఆనాడే నా ప్రాణం మీద తీపిని వదలుకున్నాను...మన శత్రువులలో ఒకరిని నేను అంతం చేసాను...నేను నా కర్తవ్యాన్నినిర్వహించాను...నా పవిత్ర కార్యంలో భగవంతుని వద్ద మీరంతా నాకు సాక్ష్యం...నేను చేసిన పని పట్ల కించిత్తు బాధపడటంలేదు...ఎంతో గర్విస్తూ మరణాన్ని స్వీకరిస్తున్నాను అని షేర్‌ అలీ లాంటి యోధులు న్యాయస్థానంలో బహిరంగంగా ప్రకటిస్తూ రావడంతో బ్రిటిష్‌ న్యాయమూర్తులు మండిపడ్డారు. (Hindustan Musalmano Ka Jang-e-Azadi Mein Hissa (Hindi), Syed Ibrahim fikri, New Delhi, 1999, P. 30)

శిక్షలు విధించి, ఉరిశిక్షలకు, కాల్చివేతలకు ఆదేశాలు జారీచేశాక శిక్షల అమలును చూసేందుకు ఆంగ్ల అధికారుల భార్యాపిల్లలు, బంధువులు కారాగారానికి వచ్చేవారు. ఆ సమయంతో ఆ యోధులు ఎటువంటి పశ్చాత్తాపాన్నిగానీ, భయాన్ని గానీ వ్యక్తం చేయకుండా ఎంతో ఆనందంగా గడపటం, ఆ శిక్షలతో తమ జీవితాలు సాఫల్యం పొందినట్టుగా సంతోషం వ్యకంచేస్తూ అమరత్వం పొందు అవకాశాన్ని కల్పించిన ఆ శిక్షల అమలు కోసం హర్షాతిరేకాలతో ఎదురు చూడటం, ఉరిశిక్షల మీద అప్పీలు చేసుకోడానికి అవకాశం కల్పించినా కూడ ఆ ప్రయత్నాలు చేయటం అగౌరవంగా భావించటం ఆంగ్లేయ కుటుంబీకులకు చాలా వింతగా తోచేది.

ఈ పరిణామాల ఫలితంగా ఉరిశిక్షలను ఆనందంగా స్వీకరిస్తున్న ఈ యోధుల పట్ల ఆంగ్ల ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుంది. ఉరిశిక్షను స్వీకరించడం అంటే పోరుబాటలో అమరత్వం పొందటం, షహీదులవ్వడంగా భావిస్తున్నయోధులకు ఆ

112