పుట:1857 ముస్లింలు.pdf/108

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిమౌల్వీలు

ప్రకటించారు. రాజద్రోహం నేరాన్నిఆపాదించినందుకు తానేమీ చింతించడం లేదన్నారు. అలహాబాద్‌ పరగణాలోని భ్రిటిష్‌ అధికారుల దోపిడి, అరాచకాల నుండి ప్రజలను కాపాడేందుకు ఆయుధం చేపట్టానని, ప్రజలను సమీకరించి తిరగబడ్డానని నిర్భయంగా పేర్కొన్నారు.బ్రిటిష్‌ పాలన అంతం కావాలన్నది తన లక్ష్యమనీ, బహదూర్‌ షా జఫర్ ను మాత్రమే తాను చక్రవర్తిగా పరిగణిస్తాననీ మౌల్వీ ప్రకటించారు. బ్రిటిష్‌ పాలనను అంతం చేయాలన్న లక్ష్యంతోనే తాను పోరుబాట నడిచానన్నారు. ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహించినందుకు చాలా గర్వపడుతున్నానని న్యాయమూర్తి ఎదుట అంగీకరించారు.

1857 ముస్లింలు.pdf

ఆంగ్లేయుల నుండి మౌల్వీ లియాఖత్‌ అలీస్వాధీనం చేసుకున్న అలహాబాదులోని కోట

భారతీయులు మానవతావాదులని, నైతిక విలువలకు అధిక ప్రాధాన్యతనిస్తారని ఆయన వివరిస్తూ మహిళల పట్ల అత్యంత గౌరవం గలవారైనందున ఆంగ్ల మహిళలకు తన పరగణాలో ఎటువంటి హాని జరగకుండా చూశామన్నారు. స్వదేశీయుల పాలనను పున:స్థాపించేందుకు తిరగబడిన ప్రజల నాయకునిగా తన ప్రాణాలను బ్రిటిష్‌ న్యాయస్థానాలు హరించినా తనకు ఎటువంటి బాధలేదన్నారు. మాతృభూమి విముక్తి కోసం ఆరంభమైన పోరాటంలో భాగంగా ప్రాణాలు విడవడాన్ని మహత్తర అవకాశంగా భావిస్తానన్నారు. విచారణ తరు వాత బ్రిటిషు పాలకులు ఆయనకు ఆజన్మ ద్వీపాంతరవాస


శిక∆ విధించి అండమాన్‌ దీవులకు పంపగా మøలీfi లియాఖత్‌ అలీ అండమాన్‌లో ప్రాణాలు 105