పుట:10879telugukaavy034400mbp.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
2
శ్రీరామదండకము.

ద్దివ్య చారిత్ర చిత్రప్రభావంబు వాగీశ నాగేశ భూతేశ మౌనీశులైనన్ నుతుల్ సేయంగాలేరు - నాకుందరంబా - దురంతాపరాధన్ - గడుం జంచలాత్మన్ - సదాఘోరదోషన్ - మహారోష - నైనన్ - భవద్దివ్యలీలల్ - సుధాసారముల్ - సర్వ లోకార్తి సంహారముల్ - దీన మందారముల్ - నారదవ్యాస సంగీతముల్ - లోక విఖ్యాతముల్ - దుష్కృత ధ్వాంతమార్తాండ సాహస్రముల్ - కృత్స్నదుష్కర్మ సంతాప రాహిత్యముల్ - దేవ సంస్తుత్యముల్ - నిత్యముల్ - గాన - నామానసాబ్జంబునందోచు మార్గంబునం బూని - నానేర్చుమందంబుగా - సార సూనస్ఫురన్మాలగా - మేలుగా - దండకం బెంతయుంగూర్చి - త్వత్పాదపద్మంబులర్చింతు - బ్రహ్మ ప్రసాదంబునన్ గర్వదుర్వారుందై - రావణాభిఖ్యుండున్ - కుంభకర్ణుండు - నింద్రాదులన్ సాధులన్ బాధనొందింపు చుండంఘ - నోర్వంగశక్యంబు గాకున్న - సర్వామరుల్ పద్మజుంగూడి - క్షీరాబ్ధి నీరంబునుం జేరి - యింపారగా నన్నుతుల్ సల్పి - త్వత్పాదరాజీవములాంచి - జోహారుగావించి - కీనాశ లోకేశు దు