ఈ పుట ఆమోదించబడ్డది
యుండెను. సర్ విల్లియమ్ జోన్సుగారి తల్లివలె నీమె కుమారుని బెంచి విద్య గరపెను. ఈశ్వరభక్తిని పరోపకారమును ప్రకాశింప జేయు సత్కార్యములచే నీమె ప్రసిద్ధి కెక్కెను. ఈమె రచియించిన కావ్యములచే నీమెకు వైష్ణవ మతమందు భక్త్యతిశయము గలిగి యున్నట్లు స్పష్టమగుచున్నది. ఈ ప్రబంధములలో నొక దానియందు నీతి సవిస్తరముగా జెప్పంబడినది. ఆ కావ్యములలో నెంచి కొన్నింటి నిపుడు ప్రథమ భాగముగ బ్రకటింపుచున్నాము. ఇది యాంధ్రదేశ మందలి స్త్రీలకు ఆత్మార్థముగాను ఆంధ్ర కావ్యములు చదువ నభిరుచిగల యూరోపియనులకు వినోదముగాను చదువ నుపయోగించును.
విశాఖపట్టణము
విజయ సం|| కార్తీక బ|| అష్టమి శుక్రవాసరము.
గోడే నారాయణ గజపతి రాయడు.