పుట:10031upanishhats033596mbp.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిమిది గీతములకు రాగతాళములమర్చి పూర్వ గీతములతోఁ గలిపి యెనిమి దెనిమిది గీతము లొక్కొక యష్టకముగాఁ జేర్పి ప్రత్యష్టకమున నుపదేశార్థగీతము లయిదాఱు నుపాసనార్థ నమస్కారమంగళార్థ గీతములు రెండు మూడు నుండు నటుల సమకూర్చి పదునాలుగ ష్టకములుగా విభాగించిరి - కాగా నీనూటపండ్రెం డుపనిషత్సార గీతములు నిపుడు మూడవ పర్యాయము ముద్రింపించితిని. ఇఁక లోకులు వీని యర్థ గౌరవమును గ్రహించి యుపయోగించి కొనఁ గోరుచున్నాను. జగత్ప్రసవితియును వరేణ్యుండును జగత్పతియు నపార కృపానిధియు నగు భగవంతునకు అపరాధియును మహాపాపియునగు నేను నాభక్తి శ్రద్ధలతో సమర్పించు నుపహారంబుగ నిది యంగీకరింపఁ బడుఁ గాత.

ఓం బ్రహ్మకృపాహి కేవలమ్‌.


గొడే నారాయణ

గజపతి రాయఁడు.

ఖర సం
విశాఖపట్టణము.