ఒకటి రెండు గీతములకు మాత్రము పూర్వ కాలమున విజయనగర సమస్థానమున సంగీత విద్య యందును వీణావాదనమందును సర్వంకష ప్రజ్ఞ గలిగి సుప్రసిద్ధులై యుండిన పెద్ద గురురాయాచార్యులవారి మనుమలును తత్పరృశులునైన గురురాయాచార్యులుఁగారును, రాగతాళములు గుదిర్చిరి. అవి నాయుపాసనాకాలములందు పాడింపబడుచు నాకు ఆనంద సంధాయకములై యుండినవి. మఱియు నపుడు స్థాపింపఁబడిన గాయక పాఠశాలయందు అనేకులకు నేర్పింపం బడియు నీవరకు రెండు పర్యాయములు ముద్రింపఁబడియు చాలప్రదేశములను భక్త జనాహ్లాదకములుగా వ్యాపించి యున్నవి. మరల నిపుడుపైగా నిరువదియెనిమిది గీతములు ఆమహామహోపాధ్యాయులవారిచే రచియింపఁబడినవి. వీరి యన్నఁగారు బాల్యముననే శాస్త్ర పాండిత్యమునను సరసకవితా ప్రౌఢిని రూఢి కెక్కి మహనీయులై యుండిన శ్రీ రామానుజా చార్యులయ్య వారలుఁగారి పుత్రులు శ్రీ శ్రీనివాస భట్టనాథాచార్యులయ్యవారలుఁగారు అస్మదభి మతానుకూలముగా నాయిరువది యె
పుట:10031upanishhats033596mbp.pdf/7
Appearance