కాళీదాస చరిత్ర
కడకుబోయి తమగురువు గ్రామాంతరము వెళ్లెననియు తమకాదినమునకు బాఠము జెప్పవలెననియు గాళిదాసుని గోరి గురూపదేశ ప్రకారము మొదలుపెట్టిరి. కొన్ని సూత్రములు చదివినతరువాత కొంతబాగము పొవుటంజేసి సందర్భము కుదరలేదు. అప్పుడు కాళిదాసుడు నడుమ కొంతభాగము పోయినదని వారితొ జెప్పి యాభాగమును దానే పూరించెను. పూరింపబడిన భాగమును దీసికొనిపోయి శిష్యులు గురువునకు జూపగా నతడు తాను రచియించినదానికంటె గాళిదాసు విరచితమైన భాగమే సర్వవిధముల బ్రశస్తమైయుండుటం జేసి యాభాగమునే తన గ్రంధమున నిలుపుకొని తాను రచించినది పాఱవైచి "కాళిదాసుఘట్ట" మని దానికి బేరుపెట్టెను. ఈ వార్త లోకములో వెల్లడియైన తరువాత కాళిదాసునకు శాస్త్ర పారంగతుడను నమ్మిక విద్వాంసులకు కలిగెను.
న వ న వ
దండి, భవ
భూతి, శంకర
ప్రముఖులైన మహాకవులు తమకు రాజాస్దానమున మునుపటి గౌరవము లేకపోవుటజేసి యేదేని క్రొత్తపుంతత్రొక్కి కాళిదాసుకన్న నెక్కుడు గౌరవము సంపాదింపవలనని నిశ్చయించి చాలకాల మాలొచించి వేదములంద్ చందోదోషములు, వ్యాకరణ దోషములు కొన్ని కనంబడుచుండుటచేత వానిని దిద్ది సంస్కరించి నిర్ధుష్టము చేయదలచినట్లు భోజమహా రాజునకు విన్నవించిరి. అపౌరుషేయములై , యనాదిసిద్ధములై, చతుర్ముఖుని ముకములువలన బుట్టిన వేదములను దిద్దుట వీరితరమాయని కాళిదాసుడు తనలో దాను నవ్వుకొని యూరకుండెను. చేతనైనచొ మీకు దిద్దుడని చెప్పి భోజరాజు మిన్నకుండెను.