89
కాళిదాస చరిత్ర
తానుజెప్పి వ్రాయించెనట. మేరమీఱిన యతని మేధా శక్తి కెల్లవారు సంతసించిరి. కాళిదాసుడు భవభూతి ప్రణీతమైన యుత్తరరామచరిత్ర నీ క్రిందివిధముగా గొనియాడెను.
శ్లో॥కావ్యేషు కాటకేష్వేన నయంనా వయమేన వా
ఉత్తరరేరామచరితే భవభూతి ర్విశిష్యతే
తా॥కావ్యములయందు నాటకములయందు మేమే పేరెన్నికగన్నవారము. కాని, యుత్తరరామచరిత్రయందు భవభూతి మమ్ముల గూడ మించుచున్నాదు.
కా ళి దా సు ని శా స్త్ర జ్ఞా న ము
కాళిదాసుదు కొన్ని కావ్యనాటకము
లను జదువుకొని గట్టి సాహిత్యం
సంపాదించి సరసమైన కవిత్వ మల్ల చేర్చెనేగాని, తక్కవ్య్లాకరణా శాస్త్రములయందు మెచ్చదగిన పాందిత్యము లేదని యతని శత్రువులోకమునందొక ప్రచారము గలిగించిరి, లోకులు కాకులవంటివారు కదా మూర్ఖబహుళమైన యీ ప్రపంచమందు ముందు వెనుకలు విచారింప ప్రవాదముల నమ్ముటయే మనుష్యులకు స్వభావమైయున్నది. కావున గాళిదాసు నెఱుగవరనెకులామాట నమ్మిరి. ప్రభాకరుండను నొక పండితుడు ప్రాభాకరమనుపేర నొక వ్యాకరణశాస్త్రమును రచియించి కాళిదాసునకు వ్యాకరణశాస్త్రమునందు మంచి ప్రవేశ మున్నదో లేదో కనుగొనవలెనని నిశ్చయించి తాను రచియించిన శాస్ద్త్రములో యొక ఘట్టములో గొన్ని తాటియాకులను దీసివైచి యా భాగమునకు ముందున్న సూత్రములయొద నారంభించి కాళిదాసునొద్ద పాఠము తిప్పుకొని రమ్మని శిష్యుల నంపించెను. శిష్యులా ప్రకరమే కాళిదాసుని