పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు
88

కాళిదాస చరిత్ర

డభిప్రాయపడినట్లు తెలిసికొని 'ఏవం ' అనుమాటలలో నున్నసున్న: దీసివైచి ఏవ ' అనుమాటగా మర్చి శ్లోకము సరిఛేసుకొనెను. ఆ మార్పుచేత శ్లొకమున కెంతే రసపుష్టి కలిగెను.

     శ్లోక తాత్పర్యము; ఈశ్లోకములో సీతారాములు గాడాలింగనము చేసికొనినట్లు వర్ణింపబడినది. ఆసయోగమువలన జెక్కిలి చెక్కిలి యెడములేకుండా గలిసి యొకక్రమములేకుండ మెల్లమెల్లగా నేమోమో మటలాడుకొనుచ్జు గౌరిలింత విడిపోకుండ నొకరిమీద నొకరు చేతులువైచికొని యుండగా దెలియకుండగనే జాములు గడచిపోవగా రాత్రిమాత్రమే వెళ్ళిపోయెను. అనగా రాత్రి వెళ్ళి పోయెనుగాని సుఖము సమాప్తము కాలేదని దీని భావము. సున్నదీసివేయుటవలన రాత్రి మాత్రమె యని యర్ధమువచ్చెను. 
     రసవంతమైన  యీనాటకం భవభూతి నిండుకొలువులో నుండగా భోజమహారాజునకు వినుపించెను. మహారాజు కార్యాంత రాసక్తివలన శ్రద్ధగా వినలేదు. రసహీనమగుటచేత రాజు శ్రద్ధగా వినలెదని తలంచి, భవభూతి విచారించి, బాణుదు కాదంబరిని జేసినట్లే దానిని మంటగలిపెను.
      తరువాత భోజక్షితిపాలు డొకనాడు భవభూతిం జూచి "నీయుత్తరరామచరిత్రము మిక్కిలి రసవంతముగా నున్నదట. ఆనాడు  నీవు చదివినప్పుడు నేను శ్రద్ధగావినలేదు. మరల నొకసారి వినిపింపు" మని యడిగెను. అడుగుటయు భవభూతి తాను గావించిన తెలివితక్కువపని రాజునకు విన్నవించెను. ప్రతిశ్లోకరసాస్పదమైన యుత్తమ నాటకము నిష్కారణముగా నశించిపోయెనే యని రాజుని సభాపరులును విచారించుచుండగా, పరశ్రేయస్సహనముగలిగిన కాళిదాస మహాకవి లేచి భవభూతిశిష్యులద్వారమున దనకాగ్రంధము వినిపించినప్పుడే తనకది కంకరపాఠముగా నచ్చెనని చెప్పి యెల్లవారలాశ్చర్యపడునట్లు