పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/96

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


87

కాళిదాస చరిత్ర

కంఠపాఠముగ నాకువచ్చినది" యని మొదటినుండి చువరవఱకు నేకరువుపెట్టి వ్రాయించియిచ్చెను. అప్పుడు బాణుడు పరమానంద భరితుడయ్యెను.

     భవభూతి మహాకవి యుత్తరామచరిత్ర మను నాటకమును విద్వజ్జన ప్రశంసనీయముగా రచించి శాశ్వతకీర్తి సంపాదించెను. కావ్యనాటక  నిర్మాతలలో నగ్రగణ్యుడైన కాళిదాసుమహాకవి కది వినిపించి వాని యభిప్రాయమును జేకొనవలెనని యతడుగూడ దన శిష్యులచేత నా మహానాటకమును గాళిదాసునొద్దకు బంపెను. నాటకమందలి యేడంకములను వారు మిక్కిలి జాగరూకతతొ వినిపించిరి. కాళిదాసుడును శ్రద్దాళువై వినెను. విన్నతరువాత శిష్యులా గ్రంధమును దీసి కొనిపోయి మరల గురువునకు సమర్పించగా భవభూతి శిష్యులనుజూచి "కాళిదాసేమనియ" నని యడిగెను. "ఏమియు ననక యూరకవెనె" నని శిష్యులు చెప్పిరి" "గ్రంధముమీద నబి ప్రాయ చెప్పక పోయినను నడుమ నడుమ నతనినోట వెడలినమాటెలేవో చెప్పు" డని యాతడడిగెను. అప్పుడు వారిటనిరి, అయ్యా! మొదటియంకములో

శ్లో॥ నమసి కిమిసి మందం మందమాసక్తియోగా
      గవిరళితకపోలం జల్పతొరక్రమేలు
      అశిధిలప్;అరిరంభవ్యాపృతైకైకదోష్ణో
      రవిదితగరయాయా రాత్రిరేవం వ్యరంసీత్

       అని శ్లోకమును మేము చదువుచుండగా నతడు తాంబూలము వైచుకొనుచుండెను. తమల పాకులకు సున్నము వ్రాయునట్టి పనికత్తెల జూచి సున్న మెక్కువైనదని యతడనెను. ఇంతకంటె నత డేమియు మాటలాడలే" దని చెప్పిరి. ఆమాట కర్ధమే మైయుండునా యని భవభూతి చాలసేపు వితర్కించి శ్లోకముయొక్క కడపటి పాదములోనున్న "ఏవం" అనుమాటలో నున్న యధికముగా నున్నదని కాళిదాసు