ఈ పుటను అచ్చుదిద్దలేదు
86
కాళిదాస చరిత్ర
శుష్యులు గురిని యాజ్ఞానుసారముగా కాదంబరి మహాకావ్యమును దీసికొని కాళిదాస సన్నిధానమున కరిగి యామూలాగ్రముగ నాగ్రంధము నతనికి జదివి వినిపించిరి. అతడు దత్తానుదాసుడై గ్రంధమంతయు నాకర్ణీంచి బాణశిష్యులని జూచి "మీగురువుగారి గ్రంధము నాకు మత్తుగలుగ జేసినదని చెప్పు" డని వర్తమానమంపెను. ఆమాటలనే శిష్యులు బానున కెఱింగించిరి. బాణుండస్పలుకులు విని తనగ్రంధము రసవంతముగా నుండకపోవుటచే కాళిదాసునకు నిద్రమత్తు వచ్చినదికాబోలు! కాళీదాసు మెచ్చని గ్రంధము లోకమున నున్నను లేకపోయినను సమానమే. ఇట్టి పనికిమాలిన గ్రంద మేల యని యా మహాగ్రంధమును శిష్యులు వద్దని వారించుచున్నను వినక పరుశురామప్రీతి గావించెను. అంనంతరము కొన్నినాళ్ళకు బాణుడు కాళిదాసుని గలసికొని మాటలాడుచుండా బ్రసంగవశమున "భాణకవీ! నీ కాదంబరి మిక్కిలి రసవంతముల్గానున్నదిసుమా" యని ప్రశంసించి మఱియొకసారి దానిని వినవలెనని యున్నదని చెప్పెను. అప్పుడు బాణుడు తెల్లపోయి "అయ్యో! గ్రంధశ్రవణ మైనతరువాత నది మీకు మత్తుగలిగించిన దని మీరు నా శిష్యులతొ జెప్పుటచేత నది రసహీనముగా నున్నదని దాని నగ్నిహోత్రున కాహుతి జేసితిని. గ్రంధ మింక దొరకుట యరిది" యని పలికి గాఢచిచారము నొందెను. కాళిదాసుడుగూడ విచారించి "అన్నన్నా! నాయభిప్రాయము దెలిసికొనలేక మీరు పొరపాటుచేసితిరి. కారంబరి యనగా, కల్లుకూడ నర్దమగుటచే గాదంబరీరసము కాదంబరీరసమువలెనే మత్తు కలిగించి పరవశత్వము నొందించినదని నాయభిప్రాయముగాని, రసహీన మైనదని నాయభిఒరాయముకాదు. నీశిష్యులు సరిగా జెప్పలేదు కాబోలు! అయినను మించిపోయినదికాదు. ఆ గ్రంధమంతయు మిక్కిలి రసవంతముగా నుండుటచే వినినప్పుడ నా మనస్సుమీద ముద్రిత