కా ళి దా సు ని బు ద్ధి కు శ ల త
బాణుడను నొక మహాకవి కలడు
ఇతడు సరస్వతీదేవికి గేవలము పంచ
బాణుడే యని జయదేవ మహాకవి చెప్పియున్నాడు. "బాణోచ్చిష్టని జగత్సర్వ" మని యీ మహాకవినిగూర్చి యొక లోకోక్తికలదు. అనగా లోకమంతయు బాణిను యెంగిలియే యని దీని యర్ధము. బాణకవి యుపయోగింపని శభ్దముగాని, ప్రయోగింపని యలంకారముగాని, కొర్పని సమాసముగాని, చెప్పనిభావముగాని లోకమునలేదనియు. నేకవి యే యే రసములు జూచినను, నెట్టికవ్యము రచించినను, నెట్తి శబ్దము ప్రయొగించినను నవియన్నియు బాణకవి వాడినవే యగుటచేత దక్కిన కవులుపయోగించిన శబ్ద ప్రపంచమంతయు బాణకవి వాడినవే యగుటచేత దక్కిన కవులుపయోగించిన శబ్ద ప్రపంచమతయు బాణుని యెంగిలియే యనియు విద్వాంసులు భావించు చుందురు. పండిత లోకమునకు భాణునియందట్టి గౌరచము కలదు. అతడు కాదంబరీ, హర్షచరిత్రలను రెండు వచన కావ్యములను మాత్ర్తమే రచియించెను. మొదటిది కల్పితకధ, రెండవది హర్షమహారాజుయొక్క చరిత్ర. చేసినవి పదేకావ్యములైనను, బాణుడు గొప్పగొప్ప పద్యకావ్యములు, నాటకములు, మహాప్రబంధములు రచియించిన మహాకవీశ్వరులతొబాటు కవిసార్ఫభౌముడని ప్రఖ్యాతి గాంచెను. అందు కాదంబరి మిక్కిలి రసవంతమైనది. ఎట్టి మహాకవికైన దాను రచియించిన కావ్యము తన కింపుగానే యుండును. అది సరసులైన కవిపండితులువిని భళీయని మెచ్చినప్పుడే దానియందు గుణములున్న వని గ్రంధకర్త తలంపవలయు గావున బాణుడు తాను నిర్మించిన కాదంబరీ మహాకావ్యమును లోకప్రఖ్యాత కవీశ్వరుడైన కాళిదాసునకు వివరించి యతని యభిప్రాయము గ్రహించుట మంచిదని తలంచి కాళిదాసునకు జదివి వినిపింపుమని యాగ్రంధము తన శిష్యులచేత బంపెను.