Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

79

కాళిదాస చరిత్ర

తూనిక సరిపుచ్చుట కెద్దుపైశివునెక్కించి, నతనిశిరస్సుపై గంగను నిలిపి యింకను తూనిక సరిపోవుటచే నాపై జంద్రుని నిలిపెను. అప్పుడు నీకీర్తియే బరువయ్యెను.

    ఈ శ్లోకము చెవినిబడినతోడనే భోజభూజాని పశ్చిమదిక్కునుండి మరలి యుత్తరదిక్కునకభిముఖుడై కూర్చుమడెను. కాళిదాసుడు రాజునకుదానంతవఱకు జెప్పిన శ్లోకత్రయము మనోరంజకముగా నుండలేదనీ యాతని యశంబు వర్ణించుచు నీక్రిందిశ్లోకము జెప్పెను.

శ్లో॥స్వర్గా ద్గోపాల, కుత్రనీజసి! సురమునే భూత కామధేనో
   ర్య్వత్స ప్యానేతుకామస్తృణచియు మధునాముగ్ధదుగ్ధం నతస్యా:!
   శృత్వా శ్రీభోజరాజప్రచురవితరణం వ్రీడశుష్కస్తనీ సా
   వ్యర్దోహి న్యాత్ ప్రయాసప్తదపి తదరిభిశ్చర్వితం సర్వముర్య్వాం

   ఈశ్లోకమునందు స్వర్గవాసియైన గొల్లవానికిని నారదునికిని  సభాషణ జరిగినట్లిన్నది.
     గొల్లవాడు: ఓ దేవమునీ! కామధేనువుయొక్క దూడకు గడ్డి తేవలెనని భూలోకమునకు బోవుచున్నాను.
  నారద: ఓ వెఱ్ఱివాడా! తల్లిదగ్గఱ పాలులేవా! 
  గొల్ల: శ్రీభోజమహారాజుయొక్క జగత్ప్రసిద్దమైన వితరణమువిని కామధేనువు సిగ్గుపడగా దాని పొదుఘెండిపోయెను.
  నారద: నీప్రయాసము వ్యర్ధము. భూలోకము గడ్డిలేదు. ఏలయన! భోజరాజు శత్రువులచే యాగడ్డినంతయు నమిలిరి.