పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
78

కాళిదాస చరిత్ర

     తా॥ హంసలు నీరక్షీరములను విభాగము చేయును. కావున బ్రహ్మదేవుడు తన హంసను బట్టుకొనుటకై పాలు, నీళ్లు చేతబట్టుకొని బైలుదేఱుచున్నాడు. చల్లచుక్క వేయంగానే పాలు తోడుకొనును గావున మజ్జిగ చేతబట్టుకొని తన పాలసముద్రమును గనుగొనుటకై నారాయణుడు తిరుగుచున్నాడు.
     శివుడు తన వెండికొండను గనుగొనుటకై గొప్ప పర్వతములు నన్నింటికి దన మూడవకన్ను  దెఱచి భస్మము చేయుచున్నాడు. నీకీర్తికాంద మూడులోకములయందు వ్యాపించుటచేత బ్రపంచ మిట్లు సంక్షోభము జెందుదున్నదిసుమా ఓ భోజరాజా !
   ఈ శ్లోకము కర్ణగొచర మగుటయు రాజు మహానందమగ్నుడై దక్షిణదిక్కు నుండి మరలి పశ్చిమాభిముఖు డయ్యను. ఈ శ్లోకముగూడ రాజునకు రుచింపలేదుగాబోలు నని తలంచి కాళిదాసుడు దానికన్న రసవత్తరమైన దానిని  జెప్ప సమకట్టి మరల నాతని యశస్సు నిట్లు వర్ణించెను.

శ్లో॥విద్యద్రాజళిభాయదే, తలయితుం
     ధాతా త్వదీయ యశ:
     కైలాసంచ నిరీక్ష్య తత్రలఘుతాం,
     నిక్షిప్తవార్ పూర్తయే
     ఉక్షాణం, తదుప ర్యుమాసహచరం,
     తన్పూర్ద్ని గంగాజలం
     తస్యాగ్రే ఫణివుంగనం, తదుపరి
     స్ఫారం సుధాదీధతిన్.

       తా॥పండితుడైన యొమహారాజా! నీకీర్తిని బ్రహ్మదేవుడు తక్కెడలో బెట్టి తూచదలచి యొక సిబ్బిలో నీకీర్తిని బెట్టి రెండవ సిబ్బిలోగైలాసపరతము నునిచి యది తేలికగా నుండుటచే నీకీర్తితో దానిని సమానము చేయదలచి భాంపూర్తికై దానిపై నెద్దు నెక్కించి యప్పటికిని  వెండికొండ కీర్తితో సరిపోవక పోవుటచే