పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/80

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

71

కాళిదాస చరిత్ర

ప్రపంచమంతను వ్యాకులపెట్టుచున్నాడు. మహాపురుషులయొక్క కార్యసిద్ది వారిమహిమయందే యుండును. కాని సాధనసామగ్రియందుండదు.

     ఈ శ్లొకము పై మువ్వురు చెప్పిన శ్లోకములకంటే మిక్కిలిరసవంతముగా నుండుటచే భోజుదు సంతొషవికసితముఖాంభోజుడై యామెను బ్రశంసించి, తన పట్టపుదేవి యగు లీలావతీదేవియొక్క యాబరణములన్నియు దెప్పించి యామెకు బహుమాన మిప్పిచెను.

కాలిదాస భోజరాజ సమాగమము

అట్లు కాళిదాసుడు భార్యాపరిత్యగముజేసి

తన విద్యావినోదములు జూపదగిన రారాస్ధాన

మేదైన లభించునా యని యందందు దిరుగుచుండ నక్కాలంబున యాచకచకొరములను సంపూర్ణ చంద్రుండును, పండితచాతకములకుఇ నీలమేఘమును, కవిధనంబులకు గామధేనువును నని పేరువడసిన భోజ్సరాజును దర్శించుటకై కొందఱు పండితులు బొవుచుండి యాతనికింగనబడిరి. ఎందు బోవుచున్నారని కాళిదాసు వారినడుగ వారిట్లనిరి--"అయ్యా! మేము మాళవేశ్వరుడగు భోజరాజును దర్శింపబోవుచున్నాము. అతడు పండితచింతామణి, కవులకుముంగొంగుబగారము, దారిద్య్రాంధకార ప్రభాకరుడు పండితులకు మితిలేని బహుమానములిచ్చుచున్నాడు. రసవంతమయిన కవిత్వము జెప్పితిమా యక్షరలక్షలతనివద్ద బుచ్చుకొన్నవారమే సూర్యదర్శనముకాగానే తామర పువ్వు వికసించినట్లు వానిని దర్శించినంత మాత్రమున బుద్ది వికసించును. కొండజలవలె గవిత్వము పుట్టుకొనివచ్చును. అతనిని సందర్శించిన మాత్రమున దారిద్ర్యము పటాపంచలైపోవును."