ఈ పుటను అచ్చుదిద్దలేదు
70
కాళిదాస చరిత్ర
రాజాశ్లోక మాకర్షించి మహానందమునొంది గొప్ప బహుమానమిచ్చి నిండు ప్రాయములోనున్నయాతని కుమారుని సమస్యాపూరణము జేయమని యడిగను. అతడిట్లు పూరించెను.
శ్లో॥విజెతవ్యాలంకా, చరంతరణీయో జలనిధి,
ర్విపక్ష: పౌలస్త్యోరణభువి, సహాయశ్చ కపయు,
పదాతిర్మర్త్యో సౌ, సకల మనదీ ద్రాక్షసకులం:
క్రియాసిద్ధి: నత్త్వేభవతి మహతాం, నోపకరణే.
తా॥జయింపవలసినది లంక, సముద్రము కాలితొ దాటందగినది కాదు. శత్రువుడన్ననో రావనాసురుడు యుద్ధములో సాయపడినవి కొతులు.యుద్ధముచేయు చున్న వీరుడు రధములెని కాలిబంటు. అట్లుండియు శ్రీరాముడు రాక్షసకులమంతయు నాశనముచేసెను. మహాపురుషులయొక్క కార్యసిద్ధి వారి మహిమయందే యుండును గాని సాధనసామగ్రియందుండదు.
ఆ శ్లోకమువిని రాజు సంతుష్టాంతరంగుడై యతనిని గూడ నర్హముగ సత్కరించి మిసమిసలాడెను. నిండుజవ్వనమున రెండవరతీదేవి వలె వినయంబున దలవంచుకొని యున్న యాబ్రాహ్మణుని కొడలిని జూచి "అమ్మా! నీవుకూడ నీ సమస్యను బూరింపు" మని యడిగెను. ఆకల్యాణి యీక్రిందివిధమున దానిం బూరించెను.
శ్లో॥ధను:పౌష్పం, మౌర్వీ మధుకరమయీ, చంచల
దృశాం
దృశాంకోణౌబాణ:,సంహృదసి బడాత్మాహిమకరం
స్వయం చైకోనంగ:,సకలభువనం వ్యాకులయతి
క్రియాసిద్ది సత్త్వి: భవతి మహతాం, నొపకరణే
తా॥విల్లు పువ్వు, నారి తుమ్మెదలగుంపు, చంచలనేత్రలైన పడతుల కటాక్షవీక్షణములు బాణములు, స్నేహితుడు ఆదిస్వరూపుడైన చంద్రుడు , తానొ శరీరమే లేనివాడు, అయినను అన్మధుడు