పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

63

కాళిదాస చరిత్ర

తోనే సంభాషణ చేసిరంట! స్త్రీలుగూడ విద్యావిశారదలై కవనములు జెప్పగలిగిరంటు పలుమాటలేల ! చేతిపనులు చేసికొని జీవించునట్టి పాటకపుజనముగూడ గొప్పగానో కొంచెముగానో సాహిత్యముగలిగి కవిత్వము జెప్పనేర్చితిరని వాడుక గలదుల్. రాజు సంపూర్ణముగా దలుచుకొన్న పక్షమున విద్యాభవృద్ధియగుట కేమియాశ్చర్యము! రాజులకేది ప్రీతియొ ప్రజలు దానినే యాచరించురు. "యధా రాజా తధా ప్రజా:" అన్నమాట సత్యము. తురకలు మనదేశమును బాలించి నప్పుడు మనవారిలో ననేకులు పారసీకభాషలొ మంచి పండితులైరి. ఆంగ్లేయులు పరిపాలించునీకాలమున హిందూదేశము నందలి ప్రముఖులు హూణవిద్యాభ్యాసముజేసి మహాపండితులై, మహావక్తలై, కవులై, ప్రసిద్ధిగాంచుట మనము చూచుటలేదా? శ్రీకృష్ణదేవరాయలు మన దేశమును బరిపాలించునప్పుడు తెనుగుభాష రాజభాష యై మహోన్నత దశబొందలేదా! అట్లే విద్యావినోదినియగు భోజుడు పండితపారిజాతమై మనీషిజనమందారమై, కవిజనకల్పకమై, మహామండలము బాలించు నప్పుడు బ్రతిమనుష్యు;డును సంస్కృత సారస్వతము నభ్యసింపవలెనని, రసవంతమగు కవిత్వము జెప్పి రాజును మెప్పింపవలెనని ప్రయత్నించెను. అందుచేత ధారానగరము సరస్వతీంనృత్యమునకు రంగస్దలమై విరాజిల్లెను. ఆ విషయమై జనులు చెప్పుకొనుచున్న కొన్నికధల నుదాహరించుట సముచితము.

కాం చ న మా ల

ఒకనాడు భొజమహా

రాజు గుఱ్ఱముపై నెక్కి

నగరవీధుల సంచరించుచుండగ నొకబాలిక తనచేత జిన్ని తాటియాకుల పుస్తకమును బట్టుకొని బడికిం బొవుచుండెను. ఆ బాలికకు రాజునకు సంస్కృతభాషలో నీక్రింది సంభాషము జరిగెను.