పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
62

కాళిదాస చరిత్ర

భోజరాజుతల్లి యానందము నెవరు వర్ణించగలరు? కాపాలికునకు రాజు విశేష బహుమాన మీయదలెచెను గాని యతడు దానిని నిరాకరించి యధేచ్చంజనియెను. వత్సరాజు పన్నిన తంత్రము సఫలమయ్యెను. ముంజ రాజు భోజనమేతుడై బుద్ధిసాగరాదిమంత్రులు వెంబడింప మహావైభవమున నంత:పురము బ్రవేశించెను.

      అనంతరము కొన్నినాళ్ళకు ముమరాజు భోజరాజునకు రాజ్యాభిషేకముచేసి బుద్ధిసాగరుని వానికి మంత్రిగా నప్పగించి తన మొవ్వురు కుమారులకు మూదుగ్రామములిచ్చి భార్యాసమేతుడై తపొవనమున కరిగెను. "భోజుడు సుందరముఖాంభోజుడు, యాచక కల్పభూజుడు, భానుసమానతేజుడు, భోగబిడౌజు" డను చు బండితులు బామరులు, ప్రజలు నుతియింప సకల విద్యావిశారదుండై, యశేష శాస్త్రపారంగతుడై, మహా కవియై, కవిజన కల్పవృక్షమై, బహుగ్రంధకర్తయై, విద్యలభోజుండని పేరువడసి చిరకాలము నసుంధర నెలెను.

భో జు ని వి ధ్యా ప్రీ తి

భో జ మహారాజు సింహాసన

మెక్కి మాళవదేశము పరిపాలకుం

డైనది మొదలుకొని మాళవదేశమునను, ముఖ్యముగా దాని రాజధాని యగు ధారానగరము నను సరస్వతీదేవి సత్యలోకమునుబాసి యాపట్టణము నివసముగా జెసికొని ప్రత్యక్షముగా నచ్చట విహరించుచు సకల విద్యల వృద్ధిచేయు చున్నదా యనునట్లు సకలశాస్త్రములు, సకలకళలు, వేదవేదాంగాది చతుర్దశవిద్యలు వర్ణించుటకు నలవి గానంత వృద్ధిబొందెను. సంస్కృత సాహిత్యము లేని మనుష్యులు ధారానగరమున నతనికాలమున లేరనియే చెప్పవచ్వును. చిన్నబిడ్డలుగూడ సంస్కృతము