ఈ పుటను అచ్చుదిద్దలేదు
9]
61
కాళిదాస చరిత్ర
బాదుకలు దొడిగికొని కౌపీనధారియై వత్సరాజు వెంట రాజభవనము జొచ్చెను. రాజకుమారుడు సురక్షితుడై యున్నాడను వార్త వత్సరాజు బుద్ధిసాగరునకు రహస్య ముగ జెప్పి యతనిని సంతొషపెట్టి యాకాపాలికుని రాజ దర్శనార్దమై తీసికొనిపోయి "రాజా! ఇతడు కాపాలికుడు. పరమశైవుడు, ఘోరనియమములు గలవాడు. ఇతనియెద్ద మహాద్భుతప్రజ్ఞలు కలవు. దేవరవారి దర్శనార్దమై తీసికొని వచ్చితిని" అని విన్నవించెను. ముంజుడు కాపాలికునికి నమస్కరించి, "స్వామీ! మీప్రజ్ఞ లేమి?" యని యడిగెను.
"మాకడ ననేకప్రజ్ఞలు గలవు. విషయముచేతను శస్త్రముచేతను చచ్చినవారిని బ్రతికించగలను. కావున మీరు పరీక్షించిచూడు" డని కాపాలికుడు ప్రత్త్యుత్తర మిచ్చెను. అట్లైన ఖడ్గవిహతుడైన మాభోజుని బ్రతికింపు ముస్వామీ!" యని ముంజు డతనిపాదములపై బడెను. కపాలికుడు "మంచిది! ఇందుకు నేటిరాత్రి శ్మశానములో హోమము చేయ వలెను. హోమమతిరహస్యము, జనులెవ్వరు నచటికి రాకూడదు. వచ్చినచో బిశాచగణసమేతుడై భేతాళుడు వారిం గబళీంచును. హోమద్రవ్యములు వత్సరాజుచేత నచటికి బంపుము. మేమరిగెదము " అని చెప్పి యంత:పురము బాసి పోయెను. రాజు బుద్ధిసాగరుని, వత్సరాజును బిలిచి తత్ప్రయత్నము జేయింపుమనెను. ముంజరాజునకు మరణము దప్పెను. ఎల్ల హొమద్రవ్యములు వల్లకాడు చేరెను. సాయంకాలమైనతరువాత గాపాలికుడు మణుగులకొలది నేయిబొసి హొమముజేసెను. అగ్ని జ్వాలలు మిన్నుముట్టెను. చచ్చినవాడు బ్రతుకు టెట్లని జనులాశ్చర్యముగా జూచుచుండిరి. రెండుజాములు రాత్రి యైనతరువాత హొమగుండము నుండి భోజుడు బ్రతికివచ్వెనని శబ్దము పుట్టెను. జనులు మహానందభరితులైరి. ముంజుడు భోజునిం గౌగిలించుకొని ముద్దాడి తనతప్పు సైరింపుమని వేడుకొనెను.