పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/69

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు
60

కాళిదాస చరిత్ర

నీవన్నట్లు నేను మహాపాతకుడను. నామొగము జూడ గూడదు. నేనింక ప్రజల మొగము జూడను. ఈ మహారాజునకు దగిన ప్రాయశ్చిత్తము విధింపుము. అట్లు తప్పక చేసెద" నని యతని చరణములపైబడ బుద్ధిసాగరుడిట్లనియె- -"రాజా! అగ్నిహొత్రంబునం బడి ప్రాణము విడుచుటకంటె దీనికి వేఱుప్రాయచ్చిత్తము లేదు. అది కర్తవ్య" మని పలుక ముంజరాజు దాని కొడంబడి దేహత్యాగమునకు గృతకృతుడై చితి సిద్దము చితిసిద్ధముచేసి తత్వమయ ప్రయత్నములం జేయుమని బుద్ధిసాగరున కాజ్ఞాపించెను. బుద్ధిసాగరు డా ప్రయత్నము చేయజొచ్చెను.

     అంతలో గలకల దెల్లవాఱెను. భోజముమారునికై విలపించు చందమున నానావిధములైన పశీఖలు కూయజొచ్చెను. దైవమా నాకొడుకు 'కావుకావు ' మని భోజమాత దు:ఖించినట్లు కాకూకావుమని కూయ జొచ్చెను. ముంజరాజువలెనే కళాహీనమై పాండువర్ణమై చంద్రమండలమస్తమింప సిద్ధముగా నుండెను. ముంజరాజు మిత్రులువలె నక్షత్రములు మెల్లమెల్లగ నడంగెను. క్రోధవర్ణక్షుంబిత మనస్కుడైన బుద్ధిసాగరుని మొగమువలెనే సూర్యమండలము పూర్తిదిగ్బామిని మొగముమీది కుంకుమబొట్టువలె బ్రకాశింపజొచ్చెను. ఆ దారుణ వార్త ధారానగరమందు పొక్కెను. ప్రజలందఱు క్రోఘూర్ణితమానసులైరి. రాజుని జంపవలెనని, రాజభవనము దగ్దము చేయవలెనని పౌరులు, మందలు మందలుగా బైలు దేఱిరి. ఎవరిని జంపకుండ రాజు తనంతటదానె చచ్చుచున్నాడని చెప్ప బుద్ధిసాగరుడు వారిని వారించెను.
    అంతలో నొక కాపాలికుడు చేత నొక పుఱ్ఱెదాల్చి చిన్న పుఱ్ఱెలు కొన్ని దండలుగాగూర్చి మెడవైచికొని శరీరమాపాదమస్తకము భస్మమలది మఱ్ఱియూడలు వలె దలమీద జడలు వ్రేలాడుచుండ