ఈ పుటను అచ్చుదిద్దలేదు
59
కాళిదాస చరిత్ర్ర
రావించి, యతడుచేసెను. మనదేశమును శిరసావహించి, యీదు:ఖసముద్రమును దరింపవలెను. అంతకన్న వేఱొకమార్గము కనబడదు" అని తలపోసి యొక సేవకునిబిలిపించి బుద్దిసాగరుని దోడ్కొని రమ్మని పంపను.
వత్సరాజు గృహంబున కరిగి భోజకుమారుని దనయింట నొక నేలకొట్టునం దాచి సంరక్షించెను.
భొజరాజుతల్లి ప్రాణసమానుడైన తన పుత్రుడు కనబడక్ పోవుటచే దూడను గోల్పోయిన యావువలె నారాత్రియంతయు రాళ్లుసయితము కరగునట్లు మిక్కిలి విలపించెను. బుద్ధిసాగరుడు రాజమందిరము బ్రవేశించి జరిగిన వృత్తాంతమంతయు రాజునోట విని విషణ్నహృదయుడై, రాజకుటుంబమునకు సంభవించిన దురవస్ద్దకు విలపించి యిట్లనియ-"రాజా! నీవంటి మహాపాతకుడు లోకంబునలేడు. శిశుహత్య కంటె, ఘోరపాతకము లేదు. అట్టి మహాపాతకమును రాజ్యలోభమున నీవు చేసితివి. నీమొగము చూడగూడదు. సోదరుని వంశము నాశనముచేసి యాతని గద్దెనెక్కి యాతని కిరీటముదాల్చి మహైశ్వర్యముల ననుభవింప దలచు చుంటివి కాబోలు. తెల్లవారనిమ్ము! ప్రజలీవార్త వినిరేని నీయంత:పురము పరశురామప్రెతిచేసి నిన్ను దుత్తునియలుగా నఱికి పాఱవైతురు. నీ కుటుంబము నిర్మూలింతురు. అన్నా! యెంతపనిచేసితివి! హా! భోజకుమార! దురాత్ముడైన పినతండ్రి చేత నీకెంతగతి పట్టినది? మేమందరము బ్రతికియుండి నీకు రవ్వంతయైన సాయము చేయలేక పోతిమి గదా! బలవర్మణకాలమున నీవెంత విలపించితివో ! ఎవ్వరిం దలచితివొ! అయ్యో! మే మందఱము మందభాగ్యులముకాకున్న నీవంటి బుద్దిశాలి-నీవంటి చక్కనయ్య--నీవంటి సుగుణ సమపన్నుడు--మమ్మెడబాసి పోవునే" అని యమాత్య శేఖరుడు వాపొవుచుండ ముంజరాజు "బుద్ధిసాగరా!