కాళిదాస చరిత్ర
ఇట్లుగ్రహవిష్ణునిచందంబున మైకముగ్రమ్మినవాని తెఱంగున, వెఱ్ఱివాని విధమున, ఎద్దియం దోచక కొంతసేపువుండి పిమ్మట నమిత పశ్చాత్తప్త మనస్కుడై యిత్తెఱంగున ఇచారింపజొచ్చెను— “హా! నేనెట్టినృశంసుడను, నాయన్న సింషులుడు, అరణసమయంబున దన, కుమారుని నాతొడపై గూర్చుండబెట్టి, నాచేతిలో జేయివైచి యప్పగించి నాకడనతడు సురక్షితముగా నుండునని సంపూర్ణ విశ్వసముగలిగి దేహమువిడిచెను. ముద్దులమూటగట్టునట్టి యాతని కుమారుని నిష్కారణముగా నేనుజంపించితిని. నేను మనుష్యుడను గాను రాక్షసుడను. రాక్షసులుగూడ నన్యులను వధింతురుగాని తమ బిడ్డలను జంపుకొనరు. నేను రక్కసులకంటె నధమాధముడను.పులి తనబిడ్డలను దాను తినదని చెప్పుదురు. నేను మానవవ్యాఘ్రంబను. చీ!నాబ్రతుకేల! కాల్సనా ! నేనుక్షత్రియకులంబునకెల్ల మహాకళంకము దెచ్చితిని. మావంశముననప్రదిష్టదెచితిని. మావమ్శమునకేగాదు. మానవజాతి కప్రదిష్ట దెచ్చితిని.నేనిజన్మించుటచేత నీవసుంధర యపవిత్రమైనది. రాజకులమపవిత్రమైనది హా!రాజకులభూషణ! పాపాత్ముడగు నాకతమున నీప్రాణములు గోలుపోయితివిగదా. ఆమాయా జ్యోతిష్కు డాదినమున నేలరవలె? వచ్చినయాఫలములు జూడుమని నీజాతకము నాతనికేలయీయవలె!ఇచ్చితినయా— యతండిట్లు చెప్పవలె! చెప్పెనిగాక, నకంతదుర్భుద్ధియేలపుట్టవలె? పుట్టినచో వత్సరాజుచేసిన హితోపదేశ మేల సె ఛెవినిబెట్టితిని? యిదంతయు నాదురదృష్టము. ఆప్రతిష్ట—పాపము—ప్రియపుత్రనాశనము నాకుసంప్రాస్తించెనుగదా? ఏమిచేయుదును? ఈవార్తవిన్న ధారాపురవాసులు నన్ను నాకుటుంబమును బ్రతుకనిత్తురా? ఏమిగతి! మహామంత్రియై, మాకుటుంబసహితముగోరిన బుద్ధసాగరుని దీసివైచితిని. అతనిని మనం