ఈ పుటను అచ్చుదిద్దలేదు
57
కాళిదాస చరిత్ర
అనిలేచి బాలునిం గౌగిలొంచుకొని ముద్దాడి తమ్మునిచేత వానిం తనయుంటికంపి భోజుని తలనంటి మాయాశిరస్సు నొకదానిని నిర్మించి మంజునియొద్దకుం గొనిపోయి చూపెను. చూపుటయు వతడు సంతసించి “మృతినొందునప్పుడు బాలుడేమైన నాతో జెప్పుమనియెనా?” యనియడిగెను. “దేవా! నాఖడ్గముతో దనపిక్కజీఱి మఱ్ఱియాకు దొన్నెలో నెత్తురుజేర్చి, మఱియొక మఱ్ఱియాకుపై నేమోవ్రాసి మీకిమ్మని యిచ్చెను. ఇదె! యాలేఖ“యని వత్సరాజు వటపత్రము స్మర్పించెను. దానిని జేకొని యందున్న యీక్రింది శ్లోకము జదువుకొనెను—-
శ్లో॥మార్ధాతాచ మహాపతి కృతయుగాలంకారభూతో గత:,
సేతు ర్యేనమహోదధౌ విరచిత: క్వాసొదశాన్యాప్తక:?
అన్యేచాసి యుధిష్టిరప్రభృతయో యాతాదివం; భూపతే,
నైకేనాపి సమం గతావసుమతీ, నూనంత్వయా యాస్వతి.
తా॥కృతయుగమున కలంకారభూతుడగుమాంధాత గతించెను. మహాసముద్రమునకు సేతువుగట్టిన రావణాంతకుడగు శ్రీరాముడుదెనమున కరిగెను. తక్కిన యుధిష్టిరప్రముఖులుగూడ కాలధర్మ ము నొందిరి. వారెవ్వరు నీభూమిని దమతో దీసికొనిఓవజాలరైరి. ఈభూమిని నీవుమాత్రము నీతోగూడ దీసికొనొపోగలవు.
చదువుకొని మానవేద్రుడు మఱ్ఱియాకు నేలబడవైచి వత్సరాజును గృహ్స్ంబునకు బొమ్మని పానుపుపై బండుకొని నిద్రపట్టక కొంతసేపిట్టటు పొరలును, కొంతసేపు పిచ్చివానివలె నూరక గోడలవైపు జూచును. మరల వటపత్రముదీసి చదువును. నోటిలోనేమేమో గొణుగుకొనుచు మాటిమాటికి నిట్టూర్పువుడుచును. ఊరక సేవకులం బిలుచును.మమ్మేల బిలచితిరని వారడుగ వారికిం ప్రత్యుత్తరమీయక యొల్రకుండును.