పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
56

కాళిదాస చరిత్ర

    హృదయంగమములై, నీతిబోదకములై మనోవికాసములై, పరమార్ధ గర్భితములైన యాభోజకుమారుని మృదుమధురవాక్యములు విని వత్సరాజు  తం మనంబు కరుగ దనయన్న కిట్లనియె:—
“అన్నా! యీబాలుని మృధుమధురసంభాషణములు వజ్రమినైనను గరగించునట్లున్నవి. నామనస్సు కరగి నీరైనది. రాజులయనుగ్రహములు మెఱుపుతీగలవలె జంచలములు, నిలకడలేని వారియనుగ్రహములు నమ్ముకొని ఘోరమైన దుష్కార్యమును నీవు జేయజూచుచున్నావు. నీవిహపరంబులకు జెడుచున్నావు. అతి సుకుమారుడైన యీకుమారుని రక్షించితిమేని మనముభయలోకములందు సుఖపడగలము. ఇతడు బ్రతికిబాగుండి మహారాజైనపక్షమున మ్నవంటివారి ననేకుల రక్షింపగలడు. ఒకవేళ నీతని సంహరింపనందుకు ముంబరాజునీశిరంబు ద్రుంచునని భయప్డుదువేమో,ఆవిధముగా నీవు చవవలసిన యోగమున్న పక్షమున నది తప్పదు. ఎన్నివిధముల  నాలోచించినను నీరాజనందనునిరక్షించుట కర్తవ్యము కావున, వీనిని వధింపవలదు” అని తమ్ముడు హితోపదేశము చేయ వత్సరాజు జాలిగలిగి పశ్చాతప్త మనస్కుడై కన్నుగవనుండి వేడికన్నీరొలుక ఖడ్గము గ్రిందబాఱవైచి భోజుకుమారుని పాదములపైబడి “కుమారా! నేను పాపాత్ముడను, సృశంసనుడను, బాలఘాతకుడను, పెద్దపులికన్న గ్రూరచిత్తుడను, ఆత్మలాభపరాయణుడనై, యంత:పురమున నవ్వారిగా సౌఖ్యంబు లందుచున్న నిన్ను మాయోపాయంబున నర్ధరాత్రమున నిర్మనుష్యమగు స్దలంబునకు గొనివచ్చి చంపదలచితిని. ఈతప్పుసైరింపుము. ముంజరాజునకు దెలియకుండ నిన్ను గొంతకాలము నాయింట దాచెదను.  అనంతర కర్తవ్యము జూచికొనవచ్చును.”