55
కాళిదాస చరిత్ర
నీవెఱుగవు. నేడు నన్నుజంపించిననాడు రేపునిన్నేదో మిషమీద జంపకపోడు అప్పుడు పశ్చాతాపపడిన గ్యారంటీలేదు. నీవీరాజును నమ్మి మిట్టిపడుతున్నావు. ఈరాజు నీకు నగేహారమీయగలడు. పరమేశ్వరుని నమ్ముకొంటివా, యతడో శాస్వతమైన ప రలోకసాంరాజ్య మియ్యగలడు. అతడు దేవతలకు దేవత,ఇంద్రునకింద్రుడు, సార్వభౌములకు సార్వభౌముడు. చక్రవర్తులకు జక్రవర్తి అట్టిజగదేక చక్రవర్తిని, సకలబ్రహ్మాండ సార్వభౌముని, సకల విశ్వనియామకుని నమ్నక, క్షుద్రభోగముల కాశించి, నీచరాజుల నాశ్రయించి, దయనుజంపుకొని, యధమాధముడైవై, యధికారమునకు బానిసవై, యకార్యలోలుడవైన నిన్నుజూడ నాకిమిక్కిలి జస్లియగుచున్నది. పాపము! నీవేమిచేయగలవు! నీరాజ్ఞ యట్లున్నది. కానిమ్ము. నీపనికానీ! ఇదిగో నాకంఠము. నేను పుట్టినదినమువచ్చినప్పుడు, వత్సరాజా!నీవును నీతమ్ముడును నాతండ్రి సంతసించుననియు, నాతల్లి సంతసించుననియు మెత్తని పుష్పమాలలువైచిరి. ఆ చేతుతోనే —యాకంఠమునే జారచోరులను, దురాచారులను ఖండిచునట్టి ఖడ్గముతో కండింపుడు. ఈశ్వరద్రోహివైనను, మహశ్వరద్రోహివిగాకుము-చేయుము-నీకార్యముజేయుము. నానెత్తురుకూచి సంతుష్టుడగుటకు, నాశిరస్సుకూచి యానందించుటకు, పాపము!ముంజుడంతో యానందముతో మేలికొని యేమియుందోచక పిచ్చివానివలె మందిరంబుంస దిరుగుచుండును. సత్వరము నాశిరస్సు ఖండించి, దీనిని సూడిదగా గొనిపోయి మీరాజునకు వెల్లడియైన కానుకగానిమ్ము. అనుగ్రహపూరితములైంస యాతని దృష్టి వర్షంబులు నీపైగురిసిన నీమనస్సు చల్కపడును”