కాళిదాస చరిత్ర
కారము చేసినవాండగురువు ఏలయన దనకు మరణ మాసన్నమైనదని తెలిసినతరువాత మనుష్యుండు జీవించియుండుట మిక్కిలి కష్టము. ప్రాణము లిప్పు డెంతవేగముబ బోయింబ నంతసుఖము. అది తెలిసిన తరువాత నెక్కువసేపు జీవించినవానికి బంధువులమీద, దలిదండ్రులమీద, మిత్రులమీద, మనసు పాఱి, భరింపరాని మనోవేదనగలుగును. ఇప్పుడు నామనస్సు మందభాగ్యురాలైన మాతల్లిమీది కరుగుచున్నది. చిరకాలము సంతానములేక కుందికుంది పలునోములు నోచినోచి కనబడిన పుట్టకు మొక్కి బహువ్రతముల్ చేసిచేసి నన్ను గాంచినది. 'నావరప్రసాది, నానోములపంట, నాగృహదీపమా! నా వంశాలంకారమా!' యని నన్ను బిలుచును. నన్ను విడిచి క్షణకాలమైన నిల్వనోపదు. చీకటి గ్రమ్మినది. చాల ప్రొద్దు పోయినది. నేనిల్లుచేరలేదని యీపాటికే పరి తపించుచుండును. ఆమెం దలంచిన నాకు మిక్కిలి జాలి యగుచున్నది. కావున నన్ను వేగవధింపుము. చేయదలంచివచ్చిన పని నిర్వత్రించటంలో నాలస్యమెందుకు? నీవు నీ శరీరమునేగాక నీయాత్మనుగూడ రాజున కమ్ము కొన్నావు. ఆత్మనమ్ముకొన్నవాడు దైవమునకు నెఱువడు - పాపమునకు నెఱువడు! వానికి ధర్మమక్కరలేదు--సత్కర్మమక్కరలేదు--నీకు ధనమే ప్రధానము--అధికారమే ప్రధానము--రాజాను గ్రహమే ప్రధానము పరమేశ్వరానుగ్రహము నీ కసరములేదు. రాజుయొక్క చిఱునవ్వులే నీ మనస్సును వికసింపజేయునవి . కాని, యీ యైశ్వర్యము శాశ్వతముగాదు. ఈయధికారము శాశ్వతముకాదు. ఈయరదంబులు ద్విరధంబులు, ఈహయంబులు ధనచయంబులు, నీభేరీభాంశకరణంబులీయాభరణంబులు శాశ్వతంబులు గావనియు, నీలొకము మనకు శాశ్వతము గాదనియు బరమేశ్వరుడు మనకార్యబుల నెల్ల నరయుచు బైనున్నవారిదనియు మనము గావించు కార్యములకెల్ల మన మతనికి నుత్తరవాదుల మనియు