పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు
42

కాళిదాస చరిత్ర

"మహర్షులయొక్కయు దేవతలయొక్కయు నోటనుండి వెలువడిన మాటలు జరుగకమానవు. సకారణముగానో నిష్కారణముగానో శపింపబడిన వారు శాపముల ననుభవించి తీరవలెను. ఈ శాపములు పైకి మహాకష్టములుగా దోచుచున్నను బ్రపంచమునకు గొంచెము ప్రయోజనకరములగును. ఈసరస్వతీదేవి కిరాతజన్మ మెత్తినందులకు గొప్పఫలముకలదు. ఏమంటిరేని భూలోకమున సంస్కృతభాష క్రమక్రమముగా క్షీణించుచున్నది. చతుర్వేదములు, షడంగములు, షడ్దర్శనములు, నష్టాదశపురాణములు, ధర్మశాస్త్రములు, జ్యోతిశ్శాస్త్రములు, వైద్యశాస్త్రము, గానశాస్త్రము, చతుష్పషీకళలు గీర్వాణభాషలో నున్నవి. ఆ భాషాప్రచారము తగ్గుటయనగా జ్ఞానము తగ్గుట. అందువలన మనుష్యులు పశుప్రాయులగుదురు. యుక్తాయుక్త వివేకశూన్యులగుదురు. ధర్మ భ్రష్టులగుదురు. కావున నీ శారదాదేవి కిరాతజన్మ మొత్తము బూర్వజన్మవాసన చేతను, శ్రీ కాళికా వర ప్రసాదముచేతను, గీర్వాణభాషాభిమానము గలిగి కవిత్వము జెప్పగలిగి లోకోపకారము చేయుచు గీర్వాణభాషాభిమానము వృద్దిజేయును. ఓ బ్రహ్మదేవా! భార్యా వియోగ మయ్యెనని నీవు విచారింపకుము. నీభార్య కాళిదాసుడనుపేర గొప్ప కవియగును. ఆమె వియోగము లేకుండ నీవు భూలోకమున సింధులమహారాజుఇకు నందనుడవై జనియించి భోజరాజనుపేర మహాప్రసిద్ధుడవై కాళిదాసునితో నిరంతర మైత్రి కలిగి యుండుము. వాణికి బ్రాణసఖీయైన సావిత్రి మర్త్యలోకమున జన్మించి నీకిల్లాలైన పట్టపుదేవియైయుండును. భరతమహాముని శాపమునుబొందిన పుంజకస్దల వేశ్యాంగనయై జన్మించి కాళిదాసునకు ప్రేమాస్పదు రాలై యుండుంగాక! సావిత్రి శాపానుసారముగ దుర్వాసుడు సరస్వతీ యవతారమగు కాళిదాసుని బరిణయంబగుగాక! ఇదే నాశాపము . భోజకాలిదాసు లన్యోన్యవియోగము