41
కాళిదాస చరిత్ర
మిక్కిలి గర్వించుచుంటిని. ఏంత గర్వములేకిన్న నాయంతవానింజూచి నీవు పరిహసింతువా! నీవుభూలోకంబున ఒకకిరాతుడవై జన్మించి నీచ స్త్రీవలన మరణంబు నొందువుగాక! “యనిశపించెను. శారదాదేవియొక్క చెలికత్తెయైన సావిత్రి నిష్కారణముగా శారద దారుణశాసవిశయైనదని విషాదమునొంది, మూర్తీభవించిన కోపదేవతవలె నున్న దుర్వాసునిం యిట్లనియె, “అయ్యా! అష్టదిక్పాలకులు, త్రిమూర్తులు, సమస్తమహర్షులు కొలువుదీర్చియున్న యీసభలో నీవుపుంజికస్దలంజూచి కామమోహితుడవై నానావికారచేష్టలు చేసి మీదుమిక్కిలి రంగస్దలముమీదికురికి యింకేమేమో చేయబోతివి. నీయవస్దంనప్పు డెవరికి నవ్వురాదు! నీవుగొప్పతప్పుజేసి సిగ్గుపడి యూరకుండక పైగా నీమహాదేవిని శపించితివా? ఏందుకు నీతపము? ఏందుకునీనిష్ట? నిర్హేతుకముగ నామెను సపించితివిగావున నీవుభూలోకముంస నాడుదానివైపుట్టి యాకిరాతునకు భార్యవై సంసారసౌఖ్య మనుభవింపక దు:ఖముపాలై దీనమైన మరణమొందెదవుగాక“ యని ప్రతిశాపమిచ్చెను. సరస్వతి తనకుద్రుర్వారమైన దుర్వాససాపము గలుగుటచే దు:ఖారవశయై మగని పాద్ములపైబడి మూర్చిలెను. చతుర్ముఖుడు తనప్రియురాలికిని దనకును వియోగము సంభవించెనని మిక్కిలి వగచెను. సభాసదులలో గొప్పశబ్దము పుట్టెను కొందఱు దుర్వాసుని నిందించిరి. కొందఱుపుంజకస్దల యవివేకమునకు వగచిరి. కొందఱు భరతమహాముని తొందరపడెననిరి, కొందఱు సరస్వతిని జూచి జాలిపడిరి. కొండఱు సావిత్రి సాహసము మెచ్చిరి. తమ కేమిశాపములు తగులునోయని మఱికొందఱు పిరికితనమున సభనుండి మెల్ల మెల్లగ్ జారిరి.
అప్పుడు శ్రీమన్నారాయణుడు నిజాసనమునుండి లేచి రంబస్దలము మీదికుబోయి హస్తమెత్తి కేకవైచి కలచన ముడిసి యిట్లనియె