Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
6]

37

కాళిదాస చరిత్ర

దనకు గొన్ని ఉద్ధు లుపదేశించుటయు నాదిగాగల వృత్తాంతము పూసగుచ్చినట్లుజెప్పెను. అదివిని రాజపుత్రిక వానివలన దోష ఏమియు లేదని ఖడ్గమావలబడవైచి యదియంతయు మేధానిధి చేసిన వంచన ముగా గ్రహించి తనపురాకృతకర్మఫలమేయని భర్తకు విద్యోపదేశము చేయింపవలెనని తలపోసి యాతని కెన్నోబుద్ధులుచెప్పి కాళికాలయమునకు బోవ నొడంబఱచి పంపెను.

కాళి కా దే వి వ ర ము లి చ్చు ట

ఆమె చెప్పినచొప్పున నతడు దేవీ

పద్మమునకరిగి తలుపులు మూసికొని

కూర్చుండి యామె వచ్చినప్పుడు “కళ్లీఓద్దెకల్లీబిద్దె“ యని యడగి యామె యనుగ్రహమునకు బాత్రుడై తక్షణమే సకలవిధ్యలు కవిత్వము నేర్చినవాడై యఖండపాండిత్యము మెఱయు నామెను శ్లోకములచేతను, దండకముచేతను, స్తనము చేసెను. ఆస్తనమున కానందమొంది యా దేవి పండితవాదములలో నతడే గెలుచునట్లును, రాజసభంతరముల గౌరవము గలుగునట్లును, సమస్యాపూరణములయందప్రతిమానప్రజ్ఞ గలుగునట్లును, నంత:పురరహస్యములనైన నవలీలగా దెలిసికొనినట్లు, నిఖిలశాస్త్రములలో నిరుపమాఅండిత్యము గలుగు నట్లును, గవిత్వమునం దద్వితీయుడగునట్లును, వరములిచ్చి పంపెను. తరువాత నతడు భార్యాంత:పురమునకరిగి భార్యను మాతృదేవతగా భావించి నామెచేత శాపగ్రస్తుడయ్యెను. రాజపుత్రిక యోగినియై యోహమిచే బ్రాణత్యాగము చేసెను. అతడు కాళిదాసనుపేరుగలిగి కొంతకాల మాపురమునందే యుండి యేమియునేఱనివానివలె దిరుగుచుండెను.