కాళిదాస చరిత్ర
భావము నేనెఱుగుదును. “త్రిపీడాస్తు” అన్న యాశీర్వచనము సరిగా నున్నది. ఎట్లన్న వినుడు.
శ్లో॥అననే పుత్రపీడా చ బంధుపీడా చ భోజనే,
శయనే భర్తృపీడాచ త్రిపీడాస్తు సదా తన
తా॥ కూర్చున్నప్పుడు తోచకుండ బిడ్డలుపీడ, భోజన సమయమందు బంధుపీడ, పానుపుమీద భర్తృఈడయును, నీమూడు పేదలును నీమె కుండవలెనని యీమహస్త్మునియాశయము. అనగానామె యిల్లు బిడ్డలతోడను, నిండియుండవలెననియు దీని తాత్పర్యము. ఇందేమితప్పున్నదో చూడుడు“అప్పలుకులు విని ధర్మవర్ధనుడును సభాసదులును పెండ్లికుమారుని బుద్ధికుశలతకు మెచ్చి మహానందభరితు లైరి.
అనంతరము రాజు మంచిముహూర్తముబెట్టించి మహావైభవముతో వివాహముచేసెను. యధావిధిగ వివాహమైనపిదప పునస్సంధాన ముహుర్తము నిశ్చయుంపబడెను. పెండ్లికుమారుడు పడకగదిలోనిలిబోయి యొడలెఱుంగక నిచురబోయెను. శారద వాని యరసికభావమునకు రోసి ప్రాణముననికి చేతితోతట్టి లేపి “అస్తి కశ్చిత్ వగ్విశేష:” అనగా నేమైంస కొంచెము పాండిత్యమున్నదాయని యడిగెను. “అస్తి లేదు గస్తీలేదు నోరుమూసికొని తొంగోసీ“ యను యతడు మోటగాజెప్పి మరల కన్నులమూసి నిద్రపోయెను. అంతట నామె కత్తిచేతబట్టుకొని భర్తను గాఢనిద్రనిండిలేపి యాఖడ్గము ఝుళిపించి “నీవెవ్వడవు? నిన్నిక్కడకు దొడ్కొనివచినవారెవ్వరు? నీవృత్తాంతయుజెప్పు“మని రాజపుత్రిక నసాధారణ సాహసముచేసి యడిగెను. అతడు గడగడ వడకుచు దాను దొమ్మరివాడై దిమ్మరీడగుటయు, మేధానిధొ తనవారికి ద్రవ్యమిచ్చి దన్నుగొనుటయు,