35
కాళిదాస చరిత్ర
సభాసదులంజూచి “మీరీ మహాపండితుని మాటల కర్దము తెలియక తెల్లబోవుచున్నారు. ‘విద్యాసేవ నిజానాతి విద్వఝనపరిశ్రమం ‘ అన్నారు గదా! విద్వాంసునిభావము విద్వాంసుడే యెఱుగును. నేజెప్పెద వినుండు.
శ్లో॥కుంభకర్ణే భకారోస్తి భకారోస్తి విభీషణే,
రాక్షసానాం కుల శ్రేష్టో రాభణో నతు రావణ
తా॥ కుంభకర్ణుని పేగులో భకారముగలదు. విభీషణునిపేరు లోను భకారముకలదు. అతనితమ్ములైన కుఱ్ఱగుంటలకే భకారముండగా రాక్షసకులశ్రేష్టుడైన రావణునకు భకారముండకూడదాయని చమత్కారము కొఱకై యీవిద్వంసుడు రాభణుడని ప్లికెను. గాని మాటలు రాకను, పాండిత్యములేకను గాదుసుమండీ!” యని సమర్దించెను. సభవాఅందఱు వానిసమాధనము విని పెండ్లికొడుకు యొక్క పాండిత్యమునకు, రసికతకు మిక్కిలి సంతసించిరి.
అనంతరము రాజు శారదను రావించి పెండ్లికొమారునిజూపి యతనికి నమస్కరింపుమని యానతిచ్చెను. ఆమె సిగ్గునం దలవంచుకొని హస్తపద్మములు మొగిడ్చి వానికభివాదముసేయ నామోట పెండ్లికొడుకు “త్రిపీడా పరిహారోస్తు“ అని మేధానిధి నూఱసార్లు వల్లింపజేసినమాటలు మఱచిపోయి “త్రిపీడాస్తు” అనిదీవించెను. మూడుపీడలు పరిహరమగుగాక యని దీవించుటకుమాఱు పీడలుకలుగుహక యని యశీర్వాదముచేయుటచేత స్భాసదులు మరల విస్మితులై యెండొరుల మొగములు చూచుకొనిరి. అప్పుడు మేధానిధి యయ్యవారు చేసిన ముబద్ధములన్నియు దిద్దుకొనవలసినవ్రాత తనకుబట్టినది గావున లేచి సభవారికిట్లనియెయె. “ఈమహానుభావుని గంభీరభావములు సానాన్యులకు దెలియవు. యోగిమహిమ పరమయోగి యెఱ్గునన్నట్లేయన