29
కాళిదాస చరిత్ర
జాడలేదు. ఆ భావమునాకెన్నడును లేదు. ఇంక నాకు సెలవిమ్ము పోయివచ్చెద" నని పలుక, నామె యాశ్చర్య్లము , విషాదము,కోపము హృదయంబును గ్రమ్ముకొని గన్నీరువెట్టుకొనుచు గద్గదకంఠంబున నిట్లనియె-- "మహాత్మా! నాతండ్రియు, గురువును జేసిన మహాపకారమ్నకు నేనెంతో గుందుచుండ మీరు గోరుచుట్టుపై రోకటిపోటు చందమున నన్ను మఱింత బాధింపజొచ్చిరి. దేవి వరప్రసాదమున మీరు విద్యావంతులై, రసికాగ్రగణ్యులై, నాప్రాణనాదులై, మీ సరసనచోగుంభనలచేత నన్నాదరింప జేయుదురనియు, నాకాపురము సరిగా నడుచుననియు, నేను పుట్టెడాస పెట్టుకొని మీ రాక కెదురు చూచుచుంటిని. నన్నిట్లుచేయుట న్యాయముకాదు. కావున నన్ను రక్షించి నన్నేలుకొనుడు" అని పాదములపైబడి ప్రార్దించెను. కాలిదాసామెమాట సరకుచేయడయ్యె, పట్టినపట్టు విడువడయ్యె. అంతట నామెమొగము జేవురింప గనులెఱ్ఱజేసి "నాజన్మము మీరు వ్యర్దము చేసితింగావున నాయుసురు మీకు దగులకపోదు. మీకు నీచస్త్రీచేత మరణము గలుగుగాక" యని శపించి వెక్కి వెక్కి యేడవంజొచ్చను. కాలిదాసు దక్షణమె యాస్దానమువిడిచి పోయెను. అపరమంగళ దేవతనలైనున్న సర్వమంగళ నిరర్దకమైన తన జీవితమును దపోనియమంబునం గడపదలంచి , సకలాభరణములం దీసివైచి, నార చీరెలుగట్టి, దుంపలు,పండ్లు, గాయలు దినుచు, విరాగిణియై యనేక వత్సరములు తపంబుజేసి మరణించి పరమ పతివ్రతాశిరోమణు లందదగిన యుత్తమగతి నందెను.