Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదించినందున నీ మహాకవి యగ్నివర్ణునికి సమకాలికుఁడై యుండవచ్చుననియు, నగ్నివర్ణుఁడు క్రీస్తుపూర్వ యెనిమిదవ శతాబ్దమువాఁడు గావున కాళిదాసుకూడ క్రీII పూII ఎనిమిదవ శతాబ్దమువాఁడై యుండుననియు నొకరనిరి. కాళిదాసు మాళవశకము నారంభించిన విక్రమార్కుని యాస్థానమువాఁడని నవరత్నములను వివరించు శ్లోకమువలన దెలియవచ్చుచున్నది. కావునను, మాళవశకము క్రీII పూ 56 సంll ప్రారంభమగుటను కాళిదాసు క్రీII పూ॥ 56 సంవత్సరముల ప్రాంతములవాఁడని యింకొక రనిరి. 56 వ సం॥రమున విక్రమార్కుఁడను రాజే లేఁడనియు, శాకులను కోరూరుయుద్ధములో జయించిన విక్రమాదిత్యుఁడే కాళిదాసు ప్రభువగు విక్రమార్కుఁడనియు, ఈ యుద్ధము క్రీ|| శ 544 సం||రములో జరిగియుండుటచేత కాళిదాసు క్రీ॥ శ॥ ఆఱవశతాబ్దమువాఁ డనియు మఱియొకరనిరి. కాళిదాసు భోజమహారాజు నాస్థానములోనివాఁడను ప్రతీతి ననుసరించి కొందఱాతఁడు క్రీ|| శ ॥ పదునొకండవ శతాబ్దమువాఁడని వ్రాసిరి ఇంకను నిట్లే యితరు లితరోపపత్తులఁ దెలిపి యితర కాలములను నిరూపించియున్నారు. ఈ రీతిగా గాళిదాసు క్రీస్తుపూర్వము ఎనిమిదవశతాబ్దమునుండి క్రీస్తుతరువాత పదునొకండవ శతాబ్దమువఱకును గల పదునెనిమిదిశతాబ్దముల మధ్యకాలములో నుండినట్లుమాత్రము గుడికిబారెడు దూరముగా నొక నిర్ధారణ చేయవలసియేయున్నదిగాని మఱియొకదారి కానరానట్లుతోచుచున్నది. కాని, యీ మహాకవి యొక కాలమువాఁడు కాడనియే చెప్పవలెను. కాళిదాసెప్పుడు జన్మించినను ఆతనియం దార్యసాంప్రదాయములును, ఆర్యుల మానససౌందర్యమును మూర్తీభవించియుండుటచే నార్యజూతియెన్నడు ప్రభవించినదో యప్పుడే యీ కవి జననమొందెననియు, ఆతఁడు ఏ పదు నొకండవశతాబ్దముననో యంతరించలేదనియు, ఆర్యజాతి భూమిపై నిలిచి యున్నన్నాళ్లు, ఆతని శాకుంతలాదిమహాగ్రంధములఁజదివి యానందింపఁ