పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

17

కాళిదాస చరిత్ర

నామె యాశ్చర్య సంభ్రమంబులు పెనుగొన “చీ! నీవు గోముఖవ్యాఘ్రంబవు. పాముకడ రత్నమున్నట్లే నీకడవిద్యయున్నది. నీకు నేను బుత్రికాతుల్యను. మంచిచెడ్డలులేక పాపపుణ్యము బరికింపక వావివరుసల నరయక గోంకుజంకులేక యిట్టికాఱులఱచిన నిన్ను నాతండ్రితో జెప్పి యిప్పుడే శిరచ్చేదంబు చేయింపగలనుగాని గురువధామహాపాతకము నాకునంక్ర మించునను భయమున నీప్రాణములు రక్షించితి. జాగ్రత్తగా నుండుము“ అని విసవిస యంత:పురమునకుబోయెను. గురువు తాను గావించిన మహాపరాధంబునకు మనంబున లేశమైన పశ్చాత్తాపంబు నొందక యామెలంత పలుకులు వినితలషుకించి “ కాని! నీపనిపట్టెదనులే, నిన్నొక్క కిరాతుకునికిచ్చి పెండ్లిచేయింపకున్నచో నాపేరు మాఱుపేరుపెట్టుము“ అని తనకసిదీర్చుకొనిటకై సమయము నిమిత్త మెదురు చూచుచుండెను.

అంతట నారాజపుత్రిక సంప్రాప్తయౌవనమయ్యెను. దుష్ట నక్ష్త్రమందు రజస్వలయయ్యెను. గురువు జ్యోతిశ్శాస్త్రమందుగూడ నపారప్రజ్న గలవాడగుటచే రాజు వానిని రావించి దుష్టనక్షత్రమునందీడేరుటవలన గలిగిన యరిష్టమును బాపుకొనుటకై యేమిశాంతి జేయవలెనని యడిగెను. గురువు తనపగదీర్చుకొనుటకు దగిన యదను సమీపించెనని మనంబున సంతసించి యొక్క మూహర్తమాలోచించి యిట్లనియె. “రాజేంద్రా! ఈనక్షత్రమతిదుష్టమైనది. ఇదిగ్రహశాంతితోడను, బ్రాహ్మణ సంతర్పణములతోడను శమించునట్టికీడుకాదు. బాలికనే పరిత్యజింపవలయును. పూర్వము చంద్రమతీదేవి ఈవిధముగానే దుష్టనక్ష్త్రమందు రజస్వలయగుటచే జనకుడామెను పరిత్యజించెను. మీరు కన్నకూతురును కారడవులకంపి పరిత్యజింపలేరు. కావున ధర్మశాస్త్రములబట్టి మీకుపాయాంతరముజెప్పెదను. ఈమెను సుక్షిత్రియునకు గాక చదువురాని యొక మోటవాని