15
కాళిదాసు చరిత్ర
గలిగించుచు నల్లారుముద్దుగా బెరుగుచుండెను. కాలక్రమమున నక్షరాభ్యాసము, నుపనయనము మొదలగు కర్మలు జరిగెను. గాని చదువు సంధ్యలు వాని కావంతయు నంటలేదు. సహవాసము దుష్టులతోడనే జేయుచు నిరంతర మాటపాటలయం దాసక్తిగలిగి భోజనమునకు మాత్రమే గృహంబునకు భోవుచు గ్రమక్రమంబున దుండగీడై నూరివారినందఱిని నిందించుచు, దూషించుచు , మందలించినవారిని గొట్టుచు దిట్టుచుండేను. గ్రామస్తులు తలిదండ్రులకడకు బోయి వాని యాగడంబులు బాదకరములుగ నున్నవని మొఱపెట్టుకొనిరి. తలిదండ్రులు మందలించినప్పుడు వారింగూడ దిరస్కరించెను. వారేమియుంజేయజాలక గ్రామవాసులతో నిష్టమువచ్చి నట్లు చేసికొమ్మని చెప్పిరి. అంతట గ్రామీణులందఱు దుస్సహములైన వానిచేష్టల కాగజాలక, కుక్కనుగొట్టినట్లు కొట్టి, గ్రామమునుంది తరిమి యడవుల పాలు చేసిరి. అంతట వాడొక కిరాతకులుండు పల్లెకుంజని తనబుద్దులకు జేష్టలకు దగిన సహకారులు లభించుటచేత నాకిరాతకులతో గలిసిమెలసి జంతువులను వేటాడుచు, మత్స్యమాంసంబుల భక్షించుచు, సురాపానంబుజేయుచు, దారులు గొట్టుచు , నిదియది యనక యెల్ల ఘాతుకకృత్యంబులు జేయుచు యధేచ్చగ విహరించుచుండెను. అధమస్దితినుండి యుత్తమ స్థితికి బోవుట దుర్లభముగాని యుత్తమపదవినుండి భ్రష్టుడగుట సులబము. దుస్సహవాసములవలన దిర్వినయంమువలన, దురాచారంబువలన , నెట్టి యనర్ధము వాటిల్లునో చూడుడు! వేదాధ్యయన సంపన్నుడైన బ్రాహ్మణుని యింటబుట్టిన యాబాలుడు స్వల్ప కాలములో గిరాతకుడైపోయెను. కావున సర్వవిధముల దుస్సహవాసము వర్ణింప వలయును.