కాళిదాస చరిత్ర
మిక్కిలి యక్కజపడి వానికించుక బుద్దిచెప్పిరి. కాని, మూర్ఖుల మనసు మచిమార్గమున ద్రిప్పు నెవరితరము? అతడువారి హితోపదేశంబుల సరకుగొనక వారినెగతాళిజేసి తిరస్కరించి తూలనాడెను. అంతట వారు కోపోదీపితులై కనులెఱ్ఱజేసి "దురాత్మా! సదాచారమువిడచి మునిజనవిరుద్దమైన మార్గమున నీవు సంచరించు చుంటివి. గావున నీవుత్తరజన్మంబున నొకకిరాతుడవై యుందువు గాక! " యని శపించిరి. శాపాక్షరములు వారినోట వెలువడినతొడనే చిరంతపుడు భయాక్రాంత చిత్తుడై పశ్చాత్తప్తమనస్కుడై శ్రీమన్నారాయణ చరణారవిందసేవకులగు నమ్మునిసత్తముల పాదములపై బడి యనుగ్రహింపుడని వేడుకొనెను. నవనీతహృదయులగు నమ్మునిచంద్రులు సదయులై "ఓయీ ! యిచ్చినశాపము సంపూర్తిగా మఱల్పజాలము. కాని, కొంతమార్పు చేసెదము. నీవు మొదట బ్రాహ్మణగర్భంబునంబుట్టి విద్యానయశూర్యుండవై కిరాతులంగలసి సంచరించెదవు. అనంతరము దేవీ ప్రసాదంబున మరల బ్రాహ్మణుడవై జగత్ప్రసిద్ది గాంచెదవు" అని శాపము కొంత త్రిప్పి యధేచ్చంజనిరి. కాలక్రమంబున వానితపంబు భంగంబువావించి యచ్చనలు నియచ్చడలోకంబునకు జనిరి. చిరంతపుడు కడు వృద్దుడై భోగవిముఖుడై యన్నివిధంబుల జెడి మృతి నొందెను.
బాల్యము
అతడుత్తర జన్మమున
గౌడదేశమున సంతానహీనుడై బిడ్డలకై తపించునట్టి యొకానొక బ్ర్రాహ్మణునకు నందనుడై రూపరేఖా విలాసంబుల నెల్లర కానందము