ఉపోద్ఘాతము
గద్యచక్రవర్తులను బిరుదమునకు తమ గ్రంథరాజములచే నెంతయుఁ బాత్రులయిన బ్రహ్మశ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహము పంతులుగారి యీకృతికుపోద్ఘాతము వ్రాయఁబూనుట సూర్యునిచూపించుటకై దివీటీని వెలిగించునట్టిపనియని వేరుగఁ జెప్ప నక్కఱలేదు. కాని, ఈ పుస్తకప్రకాశకులు నన్ను కోరియుండుటచేతను, కాళిదాస మహాకవి సార్వభౌముని వృత్తాంతమును దెలుపు గ్రంథ మగుటచేతను, శ్రీ లక్ష్మీనరసింహముగారి కృతికి పీఠిక వ్రాయుటయే గౌరవదాయకమగుటచేతను నేనీపనికిఁ బూనికొంటిని.
మన పూర్వకవీశ్వరులనుగూర్చిన చరిత్రవిషయములు మన కంతగా కానరాకుండుట చాలవిచారకరము. అందును లోకమునంతటినీ దమ కవితామృతమున చొక్కింపఁజేసిన కాళిదాసాది మహాకవుల వృత్తాంతము నిశ్చయముగా తెలిసికొనఁగలుగుటకు వలయు సాధనములు లేకుండుట కడుంగడు శోచనీయముగదా.
కాళిదాసేకాలమువాఁడు ? అను విషయముగూర్చి పండితులును చరిత్రప్రియులును తర్కవితర్కములను చేయుచున్నారు. రఘువంశ కావ్యము చివర -
| | "తం భావాయ , ప్రసవసమయాకాక్షిణీనాం ! ప్రజానా | |
అనివ్రాయుచు కాళిదాసు అగ్నివర్ణుని భార్య గర్భమందుండిన శిశువుతో రఘుకులమునఁ దాను జెప్పఁదలచిన రాజులపేళ్లను పరిసమా