కాళిదాస చరిత్ర
కాళిదాసు జన్మ వృత్తాంతము
పూర్వకాలమున మాళవదేశమున
నొక గొప్పతపోవనముకలదు. అది సకల వృక్షములతోను, పుష్పభరిత లతలతోడను, మిక్కిలి సుందరములగు పక్షివిశేషములతోను, నానావిధ మృగసంతతితోడను, నిండి యతిమనోహరమై మహాప్రభావ సంపన్నులగు మహర్షులతోడను నిండియుండెను. ఆతపోవన ప్రభావము వర్ణింపదరముగాదు. అక్కడి ఋషుల ప్రభావముచేత బిల్లులు నెలుకలు వైరములేక చర్లాట లాడుచుండును. నెమళ్లు వేసవికాలమందెండంబడి పాములను దమ ఫించములనీడకు జేర్చితాపశాంతి జేయును. ఆవులు పులిపిల్లలకు బాలిచ్చును. పులుల గుహలలో జింకలు నిద్రించును. చిలుకలు, గోరువంకలు మహర్షులు వల్లించునపుడు విని స్వాధ్యాయము జరుపుటయేగాక ఋషికుమారుల కప్పుడప్పుడు దప్పుల దిద్దుచుండును. భక్తిలేనివారికైన నాయాశ్రమము బ్రవేశించినపుడు విశేషమైన భక్తిజ్ఞానవైరాగ్యములు గుదురుచుండును. ఆ యాశ్రమము పవిత్రతకు దానలంబై శాంతికి స్ధావరమై జ్ఞానమునకు నిధియై భక్తికి బరమావధియై వైరాగ్యమునకు బుట్టినట్లై నిష్టకునిలయంబై విరాజిల్లుచుండును. వెందియు నాయాశ్రమంబు నిర్మల స్వాదుజలపూరితములగు సరొవరంబులును, సరోవరంబులకాంకారంబులై విలసిల్లు తామరపువ్వులును, బువ్వులయందలి ననమకరంద రసములు ద్రావుచు కమ్మని ఝుంకారమ్ములు చేయు తుమ్మెదలును, తుమ్మెదఝుంకారమ్ముల కనుగుణమ్ముగా గెలుగెత్తికూయు శుకపికశారికా