పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/181

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


172

కాళీదాసు చరిత్ర

    ఎందఱురాజులు వసుంధర నేలియుండలేదు? ఏందఱు భూపాలురు సింహాసనము నెక్కియుండలేదు? ఎందఱు ఎందఱు నవరత్నఖచిత కిరీటములు ధరించియుండలేదు? ఎందఱు విద్యావినోదులై యుండలేడు. ఎంద అగ్రహారములు, మాన్యములు కవిపండితుల కిచ్చియుండలేదు? ఎందఱు పరస్క్రమవంతులై మహాసైన్య సమేతులై పరదేశంబుల జయించియుండలేదు? అందఱికి నిట్టీకీర్తి కలిగెనే! ఏరాజు నామము స్మరించినమాత్రమున దారిద్ర్యదేవత కడుదూరమునకు బాఱిపోవునో, యేభూపాలునిమొగము జూచినమాత్రమున గవిత్వము మహాప్రవాహముగా మందమతికైన బుట్టుచువచ్చెనో, ఏరా జక్షరలక్ష లిచ్చి కవిపండిత పారిజాతమని ప్రసిద్ధివడచెనో, ఏరాజసభామందిరము శారదాదేవి నృత్యము చేయుటకు రంగస్ధలంబయ్యెనో, యెవ్వరి నివాసంబు కతంబున ధారానగరము ధన్యమయ్యెనో, మాళవదేశ మలంకరిఒపబడెనో, యట్టిభోజభూపాలుడు, సింధురాజగర్భరత్నాకరసంపూర్ణచంద్రుడు, సావిత్రీగర్భశుక్తి ముక్తాఫలము, సంపాదించినయశస్సు, ప్రపంచమున నెంతకాలము సూర్యమండల  మంధకారమునుబాపుచు వెలుగుచుండునో, యెంతకాలముచంద్రమండలము చంద్రమండలము చలువలు వెదజల్లుచు నాకసంబున కలంకారమైయుండునో యెంతకాల నక్షత్రములు గగనమధ్యమున దాకిన వజ్రములతీరున భాసిల్లుచుండునో, యెంతకాలము రత్నాకరములనుపేరుతో సముద్రలింకక  యుండునో, యెంతకాలమాభూదేవి సకలసస్యప్రధాయినియై భూతకోటిని దృప్తి పఱ బరచుచుండునో, యెంతకాలము వాయువు ప్రసరించుచుండునో యంతకాలము నిర్మలమై నిశ్చయమై నిరుపమానమై నిర్ధుష్టమై వెలయుగాత! 

సంపూర్ణము