పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/180

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


171

కాళిదాస చరిత్ర

మంచిగంధపు గఱ్ఱలతో నొక చితి సుద్దముచేయబడెను. త్వరగా నాహుతియగుటకు, నగ్నిహోత్రుని ప్రీతికొఱకు నేతికడవలు ప్రక్కన సిద్ధము చేయబడెను. "రాజ్యూంతే నరకం ధృవ" మ్మను లోకోక్తిని బట్టి రా జెంత సత్పరిపాలనము జేసినను నెఱిగియు నెఱ్లుగకయు ననేక పాపములం జేయును. గావున నామాట జ్ఞప్తికి దెచ్చుకొని భోజభూపాలుడు సకల పాపనివృత్తికొరకును, శాశ్వత మోక్షపదప్రాప్తికొఱకును, రామకధాసుధారసము ప్రబంధరూపముగా వెలయింప వలెనని యాశుకవిత్వముగా 'చంపూ రామాయణము ' రచియించి యేడుగడియ లగునప్పటికి సుందరకాండము ముగించెను. తరువాత దనకు గడువు లేదని యుద్ధకాండము ముగింపకయె మరణకాంక్షియై చితినారోహించెను. సహగమనము చేయదలచి పట్టమహిషి యగు లీలావతీదేవియు భర్తతొడిదేలోకమని మున్నుమెత్తని హంసతూలికా తల్పముమీద నాతనిప్రక్కను బండుకొనియెను. చితి దరికొల్పంభడెను. అబ్బా యనక సమ్మాయనక ముఖవిలాసము మార్చక యాదంపతులు నగ్నిహోత్రున కాహుతులైరి. తన జన్మమధ్యమునందెన్నడు నటువంటి యాహుతి తనకు దొరకదు గావున లోకాతీతమైన యట్టియాహుతి సంప్రాప్తించినందుకు మహానందభరితుడై కాంబొలు నగ్నిహొత్రుడు విజృంబించి సేవకులుబోయి నాజ్యమును గడుపాఱద్రావుచు దేదీప్యమాన ప్రభలతో వెలిగి యత్యల్పకాలమున దంపతులను భస్మావశిష్టులు జేసెను.

    ఆవిధముగా సకల కవికులచక్రవర్తియగు కాళిదాసుండ స్తమింప రాజకులభూషణుడును, విద్వజ్ఞన కల్పవృక్షమును, విద్యావినొదినియు, దానకర్ణుడును, దయామయస్వరూపుడును, పండిత బాంధవుడును నైన భోజరాజు స్వర్గస్ధుడై, మృతినొందియు జీవించియుండెను.