9
కాళిదాస చరిత్ర
జంఘామారుతము వీనందొడగెనుయ్. గొప్ప గాలివాన వచ్చెను. పిడుగులు పడజొచ్చెను. అందుచేత నామహీసురుడు స్వగ్రామమునకు రాలేకపోయెను. పురాణము చెప్పుటకు వేళయగుటచే రాజు బ్రాహ్మణు నింటికి వర్తమానమంపెను. ఏమిప్రమాదమొచ్చెనో బ్రాహ్మణునిభార్య భయపడజొచ్చెను. అప్పుడు బాలుడు "అయ్యా! నేనుపోయి రాజగృహమున బురాణము చెప్పివచ్చెద"పలుక "వెఱ్ఱివాడా! అదినీకెట్లు సాధ్యమగు" నని తల్లిమందలించెను. ఆమె మాట వినక రాజసేవకునివెంట నాబిడ్డడు పోయి రాజదర్శనముచేసి "మానాయనగారు గ్రామాంతరము వెళ్లి రాలేకపోయిరి. పురాణము నేజెప్పదను. ఏగ్రంధము జెప్పవలయునో సెలవిండు" అనియడిగెను. రాజువానిమాటలు విని నవ్విమహాసార్ధకముగా "మహాభారతములోని నలచరిత్రము నేడు పురాణము చెప్పవలయును. చెప్పగలవేనిజెప్పుము" అనిపలికెను. అప్పుడాబాలకుడు వల్లెయని "దేవా! ఒకరుచెప్పిన గ్రంధము చదివి నేనుపురాణముచెప్పను. గ్రంధముగూడ నేనేరచించి పురాణము జెప్పెద చిత్తగింపుడు" అని యశుధారగా నలోదయ మని పేరుపెట్టి నలచరిత్రము నవరసములతొడను, బహు యమకములతోడను, జెప్పెను. రాజతని కవిత్వము విని యట్టి పసిబాలు డట్టి మహాకవిత్వము జెప్పినందుకు మిక్కిలి యాశ్చర్యమునొంది గొప్ప బహుమానము జేసెను. ఇవన్నియు గల్పితకధలని తెలియుచునేయున్నది. మొత్తముమీద గాళిదాసుపేర మూడునాటకములు నాలుగు కావ్యములు మాత్రమే ప్రచారముగలిగియున్నవి.